తెలంగాణ

నీరొచ్చింది... గండి పడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. ఎంజికెఎల్‌ఐలోని మూడు లిప్టుల్లో మొదటి లిప్టులలోని ఐదు మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తూ కిందికి వదులుతున్నారు. ప్రధాన కాలువల ద్వారా నిర్మించిన డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువులను నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటుండగా, కాలువలు లేని ప్రాంతాల్లో కాలువ కట్టను తెంపి మరోవైపు నీటిని తిప్పుకుంటున్నారు. బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామం నుంచి బుద్దారం వైపునీటిని మళ్లించేందుకు గురువారం రాత్రి ఆ ప్రాంత రైతులు వచ్చి కాలువను తెగ్గొట్టగా.. బిజినేపల్లి మండలానికి చెందిన రైతులు దానిని అడ్డుకోవడంతో ఇరు ప్రాంతాల మధ్య గొడవ ప్రారంభమైంది. పోలీసులు కలుగచేసుకొని ఇరువర్గాలను శాంతపర్చినప్పటికీ శుక్రవారం ఉదయం కూడా కొద్దిసేపు ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అధికారికంగా కాలువలు ఉన్న ప్రాంతానికి నీరు పోవాల్సిందేనని, దానిని అడ్డుకోవద్దని, కాలువలను తెగ్గొట్టి అక్రమంగా నీటిని మళ్లిస్తే.. అడ్డుకుంటామని బిజినేపల్లి మండలానికి చెందిన రైతులు కరాఖండీగా చెప్పడంతోపాటు రాత్రి తెగ్గొట్టిన కట్టకు మరమ్మతు పనులు చేయడం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపురం గ్రామ సమీపం నుంచి డిస్ట్రిబ్యూటరీ లేన్ కట్టను ఆ గ్రామానికి చెందిన కొంతమంది తెగ్గొట్టి ఆ గ్రామ చెరువుకు నీళ్లు మళ్లించారు. దీంతో దారిపొడవునా ఉన్న వివిధ రకాల పంటలు పూర్తిగా నీట మునిగాయి. నాగనూలు చెరువుకు నీళ్లు రాకుండా పెద్దాపురం గ్రామస్థులు కాలువ కట్టను తెగ్గొట్టారని తెలియడంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించి అక్రమంగా తెగ్గొట్టిన కట్టను పూరించేందుకు చర్యలు చేపట్టారు. నాగనూలు చెరువుకు నీళ్లువస్తే నాగర్‌కర్నూల్‌లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుంది. పెద్దాపురంలో తెగొట్టిన కట్టను నగరపంచాయతీ చైర్మన్ మోహన్‌గౌడ్, టిఆర్‌ఎస్ నేత జక్కా రఘునందన్‌రెడ్డిలు పరిశీలించి వెంటనే కట్టకు మరమ్మతులు చేసి నాగనూలు చెరువును నింపేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.

పెద్దాపురం చెరువులోకి చేరుతున్న నీరు