తెలంగాణ

కొత్త బిఇడి కళాశాలల దరఖాస్తులను అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: కొత్తగా బిఇడి కాలేజీలు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్న వారందరి దరఖాస్తులను అనుమతించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌సిటిఇ నిబంధనలను పక్కన పెట్టి కొత్తగా బిఇడి కాలేజీలు రాకుండా అడ్డుకోవడం రాష్టప్రరిధిలో అంశం కాదని, అలాంటి అధికారం రాష్ట్రానికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఒకసారి అన్నీ పరిశీలించిన తర్వాతనే ఎన్‌సిటిఇ అనుమతి ఇస్తున్నపుడు ఇక దానికి అనుమతి ఇవ్వకపోవడం అనేది రాష్ట్రప్రభుత్వం ఇష్టం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య లేదా వారి ఆసక్తి సాకులు చెప్పి కాలేజీలు రాకుండా అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై
హైకోర్టు రూలింగ్
అగ్రి గోల్డ్ గ్రూప్‌కు చెందిన రెండు ఆస్తుల అమ్మకంపై యాజమాన్యం, పిటిషనర్లు దృష్టి సారించాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. జస్టిస్ వి రామసుబ్రమణియన్ , జస్టిస్ ఎస్‌బి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన రిట్‌పై హైకోర్టు న్యాయమూర్తులు ఈ ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. సంస్థ తరపున హాజరైన న్యాయవాది ఎల్ రవిచందర్ మాట్లాడుతూ 1307 ఎకరాలను ష్యూరుటీ చూపించి కేవలం 18 కోట్లు మాత్రమే రుణం తీసుకుందని వివరించారు.
బి కేటగిరి సీట్లపై తేల్చండి
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మినహా మిగిలిన విద్యార్ధులు బి కేటగిరి సీట్లలో చేరే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ వైఖరిని చెప్పాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల తీరును ప్రశ్నిస్తూ కొంత మంది విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డి కింద బి కేటగిరి సీట్లలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు అర్హులు కానపుడు నీట్ కింద 15 శాతం కోటాలో రెండు రాష్ట్రాల విద్యార్థులు ఎలా అర్హులు అవుతారని విద్యార్థులు కోర్టులో సవాలు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం మంగళవారం నాడు స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఆ విషయం మీకెలా
తెలిసింది: హైకోర్టు
సింగపూర్ కన్సార్టియం దాఖలు చేసిన బిడ్లను తెరవకుండానే ఆ సంస్థ వల్ల మంచి రెవిన్యూ వాటా వస్తుందనే నిర్ణయానికి రాష్ట్రప్రభుత్వం ఎలా వచ్చిందని హైకోర్టు సోమవారం నాడు నిలదీసింది. బిడ్లను తెరవకుండానే మలరో పక్క అమరావతి క్యాపిటల్ ఏరియా అభివృద్ధికి కాంపిటీటివ్ బిడ్డర్లను ఎలా ఆహ్వానించిందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన బెంచ్ ప్రశ్నించింది. గత వారం స్విస్ ఛాలెంజ్‌ను నిలిపివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలపైన రాష్ట్రప్రభుత్వం సిఆర్‌డిఎ దాఖలు చేసిన రివిజన్ పిటీషన్‌పై సోమవారం నాడు విచారణ జరిగింది. సింగపూర్ కన్సార్టియం బిడ్లను తెరిచిన తర్వాత అనుకున్నట్టు రెవిన్యూ వాటా లేకుంటే ఇపుడు చేస్తున్న మొత్తం కసరత్తు అంతా వృధా అవుతుంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ విషయాన్ని బిడ్‌లోనే నిర్బంధం చేశామని అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఇంత వరకూ ఒక్కరూ బిడ్లను దాఖలు చేయలేదని అడ్వకేట్ జనరల్ పేర్కొనగా, ఒక్కరు బిడ్లను దాఖలు చేసినా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
డాక్టర్‌పై కేసు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఒక రిటైర్డ్ కెప్టెన్ కామేశ్వరరావు ను ఢీ కొట్టిన కేసులో వైద్యుడిపై కేసు దాఖలు చేయమని సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు సూచిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి ప్రతాప్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రిటైర్డ్ కెప్టెన్ కామేశ్వరరావు కుమారుడు డాక్టర్ టి భాస్కర్ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ ఎం ఎస్ రామచంద్రరావు సోమవారం నాడు విచారించారు. పిటీషనర్ తరఫున ఎస్ వాణి తన వాదనలు వినిపిస్తూ కామేశ్వరరావును ఢీ కొట్టిన సిద్ధార్ధ దారపునేనిపై చాలా స్వల్ప కేసులు నమోదు చేశారని, తాగిన మైకంలో వాహనం నడిపిన వైద్యుడిపై కఠినమైన శిక్ష పడేలా కేసులు నమోదు చేయాలని కోర్టులో వాదించారు.