తెలంగాణ

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, సెప్టెంబర్ 27: మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండల పరిధిలోని గంగిమాన్‌దొడ్డి గ్రామంలోమంగళవారం ఉద యం తమ వ్యవసాయ పొ లం దగ్గర ఇద్దరు రై తులు విద్యుతాఘాతానికి దుర్మరణం చెందా రు. రోజు మాదిరిగా రైతులు తమ వ్య వసాయ పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా సర్వీస్ వైర్‌కు షార్ట్‌సర్క్యూట్ రావడంతో కరెన్న అలియాస్ అడివన్న (38) కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న ఆయన సోదరుడు ఈరన్న (35), అతనిని రక్షించేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన తెలుసుకుని చుట్ట్టుపక్కల ఉన్న రైతులు గ్రామస్థులకు సమాచారం అందించారు. అధికారులు విఆర్ ఓతో పాటు గ్రామంలోని టిఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకుని విద్యుత్ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. విద్యుదాఘాతానికి గురైన రైతు కుటుంబాలకు విద్యుత్ అధికారులు తక్షణ సహాయం కింద రూ.10వేల చోప్పున ఇరు కుటుంబాలకు అందజేశారు. స్థానిక జడ్పీటిసి సభ్యురాలు శ్యామల, హన్మంతునాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల చొప్పున అందజేశారు.