తెలంగాణ

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.100 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు కేంద్రం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్రంలో 12వందల కోట్ల రూపాయల వ్యయంతో 120 మైనారిటీ కాలేజీల నిర్మాణం చేపట్టామని, దీనికి కేంద్రం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇటీవల కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖను కోరారు. దీంతో రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ శుక్రవారం మహమూద్ అలీకి ఫోన్ చేసి చెప్పారు. రాష్ట్రంలోని ఏడు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు నక్వీ చెప్పారని మహమూద్ అలీ తెలిపారు.