తెలంగాణ

అమ్మో.. ఫస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ, ప్రైవేటు వర్గాల్లో ఆందోళన పెన్షనర్లు, ఉద్యోగుల్లో కంగారు
జీతాలేమో నేరుగా ఖాతాల్లోకి జమ ఎటిఎంల నుంచి వచ్చేది కేవలం 2వేలు
బ్యాంకుల నుంచి వారానికి 24 వేలే సామాన్యుడి బతుకు బండికి కరెన్సీ కుదుపు

హైదరాబాద్, నవంబర్ 25: పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటి వరకు ప్రజలు ఎదుర్కొన్న బాధలు, సమస్యలు ఒక ఎత్తయితే, ఒకటో తారీఖు నుంచి సమస్యలు రెట్టింపు కాబోతున్నాయి. ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా 500, వెయ్యి నోట్లు రద్దు చేశారు. అక్కడినుంచి జనం కష్టాలు మొదలయ్యాయి. నగదు మార్పిడి, కొత్తనోట్ల కోసం ముఖ్యమైన పనులు వదులుకొని బ్యాంకులు, ఎటిఎంల వద్ద గంటల తరబడి నిలబడ్డారు. నిలబడుతూనే ఉన్నారు. శుభకార్యాలు వాయిదాపడ్డాయి. సుమారు 70మంది మృత్యువాత పడ్డారు. అయినా కరెన్సీ కష్టాలు కొలిక్కి రాలేదు. ప్రతివారం బ్యాంకు ఖాతాల నుంచి 24 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని, ప్రతి రోజూ ఎటిఎం నుంచి రెండు వేలు డ్రా చేసుకోవచ్చని చెప్పినా, అనేక బ్యాంకులు 10 వేలకుమించి ఇవ్వడం లేదు. అందుకు కారణం వారి వద్ద చాలినంత డబ్బు లేకపోవడమే. ఇప్పుడే ఇలావుంటే మరో ఐదు రోజుల్లో ఒకటో తారీఖు రాబోతుంది. అప్పటినుంచి అసలు కష్టాలు మొదలవ్వబోతున్నాయంటూ పేద, మధ్య తరగతి ప్రజల్లో ఇప్పటినుంచే ఆందోళన మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్ధల ఉద్యోగులకు ఫస్ట్‌కే జీతాలు వస్తాయి. ఆస్పత్రులు, కొన్ని కార్పొరేట్ సంస్థలు, ప్రయివేట్ కంపెనీలు ఒకటి నుంచి 7 వరకు జీతాలు చెల్లిస్తుంటాయి. మరికొన్ని సంస్థలు మాత్రం 10న చెల్లిస్తుంటాయి. అయితే ఆయా సంస్థలు జీతాలు చెల్లించే విషయంలో జాప్యం చేసే అవకాశం లేదు. కానీ ఉద్యోగులు, కార్మికులకు మాత్రం తిప్పలు తప్పేట్టు లేదు. కారణం జీతాలు నేరుగా డెబిట్ కార్డుల్లోకి వచ్చేస్తాయి. కానీ, ఆ మొత్తాన్ని ఎలా విత్ డ్రా చేసుకోవాలన్నదే ఇప్పుడు అసలు సమస్య. డబ్బు డ్రా చేయాలంటే ఎటిఎం ద్వారా అయితే 2 వేలు, బ్యాంకుల నుంచి వారానికి 24 వేలు మాత్రమే విత్ డ్రా చేసేందుకు వీలు కల్పించారు. నోట్ల కష్టాలు ఇంకా తీరలేదు కాబట్టి చెల్లింపుల వద్ద కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. రెండు వేలు డ్రా చేసి ఎవరికని చెల్లిస్తాం, వారంలో 24 వేల డ్రా చేయాలన్నా, అనేక బ్యాంకులు 24 వేల రూపాయలు ఇవ్వడం లేదు. తమ వద్ద చాలినంత డబ్బు లేదు కనుక, 10 వేలతో సరిపెట్టుకోమని బ్యాంకుల ముందు కంప్యూటర్ ప్రింటవుట్లు పెడుతున్నాయి. పైగా ఆ కొద్ది మొత్తానికైనా గంటల తరబడి ‘క్యూ’లో నిలబడాల్సిందే.
దొరికిన కొద్దిమొత్తం నెల ఖర్చులకు ఎలా సరిపెట్టాలన్నదే అసలు ప్రశ్న. పాలవాడి నుంచి, పేపర్ బాయ్, ఇంటి అద్దె, నిత్యావసరాలు, స్కూలు వ్యాను లేదా ఆటో డ్రైవర్, ఆస్పత్రుల ఖర్చు, మందుల కొనుగోలు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు.. ఇలా ప్రజలు వారి స్థోమతు బట్టి అయ్యే ఖర్చులన్నింటికీ డబ్బులు కావాలి. అయితే తాము నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ము స్వేచ్ఛగా వాడుకునే పరిస్థితి లేకపోవడం ఏమిటన్న అసహనం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఇలాఉండగా ఉద్యోగులకు, కార్మికులకు వ్యక్తిగత అకౌంట్లో జీతం రాగానే విత్ డ్రా చేయడం అనేది ప్రధాన సమస్యగా మారబోతుంది. దీనికి ఎటిఎంలు, బ్యాంకుల వద్ద ‘క్యూ’గట్టే పరిస్థితి. ఆ కొద్ది మొత్తం డబ్బునైనా డ్రా చేసుకోవడానికి ఎన్ని గంటలు నిలబడాలో, ఎంత కష్టపడాలోనని ప్రజలు ఇప్పటినుంచే భయబ్రాంతులకు గురవుతున్నారు. కొత్త కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేవేనా? అని అనుమానపడుతున్నారు.
chitram...
నిద్రలేచింది మొదలు ఏటిఎంల వద్ద జనం పడిగాపులు

ఇంకా అదే వరస