తెలంగాణ

భద్రతపై రైల్వే బోర్డు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను ప్రమాద రహిత జోన్‌గా నిర్వహిస్తూ, భద్రత, రైల్వే ఆస్తులు పెంచేందకు కృషి సల్పుతున్న జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తాను రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ అభినందించారు. న్యూఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణ మధ్య రైల్వే భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతకు సంబంధించి, రైల్వే ఆస్తుల విశ్వసనీయత పెంచడానికి దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా భద్రతపై తమ జోన్ అత్యంత గట్టి నిఘా పెట్టిందని, పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని, చిన్నచిన్న సంఘటనలను కూడా మళ్లీ పునరావృతం కాకుండా చాలా సునిశితంగా సమీక్షిస్తామని జిఎం, రైల్వే బోర్డు చైర్మన్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం సికిందరాబాద్ రైల్ నిలయంలో జిఎం రవీద్రగుప్తా మరో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రతకు, సమయపాలనకు సంబంధించి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. శీతాకాలమైనందున రైలు పట్టాల పగుళ్లు, వెల్డింగ్‌లు ఊడిపోవడాలు వంటి లోపాలు గమనించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రెండు వారాలపాటు పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతా ప్రాతిపదికన సునిశితంగా పర్యవేక్షించాలని జిఎం అధికారులను ఆదేశించారు.