తెలంగాణ

డబుల్ బెడ్రూంకు ఆధునిక హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: పేదల ఇళ్లంటే ఒకపుడు పిచ్చుక గూళ్లు..కానీ స్వరాష్ట్రం, స్వపరిపాలనలో సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! ఇపుడు మరో అడుగు ముందుకేసి ఎక్కువ మంది లబ్దిదారులకు ఈ ఇళ్లను అందించటంతో పాటు వారికి సౌకర్యార్దం లిఫ్టులను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నగరంలోని సనత్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, దోభీఘాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి తొమ్మిది అంతస్తుల భనవాలను నిర్మించి, అందులో లిఫ్టులు సమకూర్చేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు రూ. 151 మంజూరు చేసినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు గాను అధికారులు ఈనెల 11వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. వివిధ రకాల టెండర్ల ప్రక్రియలను వచ్చే నెల 4వ తేదీ వరకు ముగించి, ఆ తర్వాత పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రాంతాలు.. నిధుల కేటాయింపులు
నియోజకవర్గం ప్రాంతం ఇళ్లు నిధులు(లక్షల్లో)
సనత్‌నగర్ హమాలీబస్తీ 288 2016.00
యాకుత్‌పురా సయ్యద్ సాబ్‌కా బాడా 48 రూ.336.00
యాకుత్‌పురా సరళాదేవినగర్ 216 రూ. 1515.00
మలక్‌పేట పల్లిగుడిసెలు 324 రూ. 2268.00
చాంద్రాయణగుట్ట జంగమ్మెట్ 288 రూ.2016.00
అంబర్‌పేట కామ్‌గిర్‌నగర్ 270 రూ.1890.00
ముషీరాబాద్ లంబాడితాండా 108 రూ.756.00
ఖైరతాబాద్ ఇందిరానగర్ 400 రూ.2800.00
సికిందరాబాద్ దోభీఘాట్ 216 రూ.1512.00