తెలంగాణ

15రోజుల్లో వార్ధా లైన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: వార్ధా- మహేశ్వరం విద్యుత్ లైన్ 15 రోజుల్లో పూర్తి అవుతుందని, దీని వల్ల దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో శనివారం సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. వార్ధా లైన్ పదిహేను రోజుల్లో పూర్తి అవుతుందని, దీని వల్ల రెండువేల మెగావాట్ల విద్యుత్ దేశంలో ఎక్కడి నుంచైనా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. మరో ఆరు విద్యుత్ లైన్ల పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. వార్ధా- మహేశ్వరం లైన్ పూర్తి కావడం వల్ల కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్టులకు అవసరం అయిన పదివేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. శాసన సభలో తొలిసారి ఈ విషయం చెప్పినప్పుడు ఈ అద్భుతం జరుగుతుందా? అని ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి అడిగారని, జరుగుతుంది అని తాను చెప్పినట్టు కెసిఆర్ గుర్తు చేశారు. ఈ రోజు సభలో జానారెడ్డి ఉంటే బాగుండేదని కెసిఆర్ అన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాలు అంటే లాంతర్లు, ఎండిపోయిన పంటలతో వచ్చేవాళ్లని చెప్పారు. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా గవర్నర్ ప్రసంగంలో విద్యుత్ పరిస్థితి గురించి సంతోషంగా వివరించే పరిస్థితి చూసినట్టు చెప్పారు. విశేష అనుభవం ఉన్న వారిని విద్యుత్ రంగంలో నియమించినట్టు చెప్పారు. వారికి పూర్తి అధికారం అప్పగించాం, మేం జోక్యం చేసుకోమని చెప్పాం, వారు సమర్ధవంతంగా పని చేసి, అద్భుత ఫలితాలు సాధించారని కెసిఆర్ అన్నారు. జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావుతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ వినియోగించేవారని, విభజన తరువాత ఇప్పుడు తెలంగాణలోనే 9300 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తున్నట్టు చెప్పారు. పీక్ అవర్‌లో పదివేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విద్యుత్ కట్ అంటూ వాట్సప్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదేం రాజకీయం అని ప్రశ్నించారు. మరమ్మతుల కోసం కొంత సమయం విద్యుత్ నిలిపివేయవచ్చు కానీ విద్యుత్ కోతలు లేవని చెప్పారు.
రాజకీయ అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ప్రధానమంత్రి సైతం చెప్పారని కెసిఆర్ తెలిపారు.
నాలుగు వేల మంది అంగన్‌వాడీలను నియమిస్తున్నట్టు చెప్పారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులు, చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి తీపి కబురు అందించే విధంగా బడ్జెట్ ఉంటుందని కెసిఆర్ తెలిపారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్క తప్పటడుగు వేసినా ఒక తరం నష్టపోతుందని అన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.
నోట్ల రద్దు వల్ల ఆదాయం పడిపోతుందని తొలుత భయపడిన విషయం నిజమేనని చెప్పారు. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లలో 30శాతం వరకు ఆదాయం పడిపోయిందని, ట్రాన్స్‌పోర్ట్‌లో 20శాతం వరకు ఆదాయం పడిపోయిందని, మిగిలిన వాటిలో ఆదాయం యధావిధిగా ఉందని, భయపడినంతగా ఆదాయం పడిపోలేదని చెప్పారు.
తొలుత విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. దీని వల్ల పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే విధంగా వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. భూమికి బరువు అయ్యేంతగా ఈసారి పంట చేతికి రాబోతున్నదని కెసిఆర్ తెలిపారు.