తెలంగాణ

కన్నడ దర్శకుడు హేమంతరావ్‌కు ‘గొల్లపూడి’ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(కల్చరల్), మార్చి 16: తన తొలి చిత్రంతోనే భిన్నవర్గాల ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కన్నడ దర్శకుడు హేమంతరావ్ గొల్లపూడి శ్రీనివాసరావు 20వ జాతీయ పురస్కారం-2016కు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు వెల్లడించారు. గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో మలయాళం, మణిపురి, కన్నడం, అస్సామీ, తమిళం, బెంగాలీ భాషలకు చెందిన చిత్రాలు పోటీలో పాల్గొన్నాయని చెప్పారు. హేమంత్ దర్శకత్వం వహించిన గోది బన్న సాధారణ మైకట్టు అనే చిత్రం ఈ పురస్కారాన్ని గెలుచుకుందని చెప్పారు. ఆగస్టు 12న చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో జరగనున్న ప్రత్యేక ఉత్సవంలో హేమంత్‌కు పురస్కారంతో పాటు లక్షా 50వేల నగదు, జ్ఞాపికను బహూకరించనున్నట్టు మారుతీరావు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాజేంద్రసింగ్ బాబు (కన్నడ దర్శకుడు), నటి పూర్ణిమ భాగ్యరాజ్, కవితాలయ కృష్ణన్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారని అన్నారు. 1992లో విశాఖలో ఓ షూటింగ్ పాల్గొన్న గొల్లపూడి శ్రీనివాస్ ప్రమాదవశాత్త సముద్రంలో పడి చనిపోయాడు. ఆ తరువాత 1998 నుంచి శ్రీనివాస్ పేరిట ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.

చిత్రాలు.. దర్శకుడు హేమంతరావ్ *దివంగత గొల్లపూడి శ్రీనివాస్