తెలంగాణ

ఎఎస్‌సిఐ చైర్మన్ పద్మనాభయ్యను సన్మానించిన ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) కొత్త చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పద్మభూషణ్ కె పద్మనాభయ్యను శుక్రవారం ఆ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సంస్థకు కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పద్మనాభయ్యను పలువురు ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎఎస్‌సిఐ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మహ్మద్ హసన్ చైర్మన్‌ను కలిసి ఘనంగా సత్కరించారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎఎస్‌సిఐ అభివృద్ధికి తామంతా సహకరించేందుకు చొరవ తీసుకుంటామని వారు చైర్మన్‌కు హామీ ఇచ్చారు. చైర్మన్ పద్మనాభయ్య కూడా ఉద్యోగుల పనితీరును ప్రశంసించారు. మనం ఏ స్థాయిలో పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదని, ఏ స్థాయిలో పని చేసినా అది స్ట్ఫా కాలేజీ పటిష్టతకు ఉపయోగపడాలని అన్నారు. 1961 ఐఏఎస్ బ్యాచ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.