తెలంగాణ

పదిమంది అంతర్‌రాష్ట్ర నేరగాళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వివిధ మోసాలకు పాల్పడుతున్న పది మంది అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను హైదరాబాద్ నగర సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.90 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్స్, బంగారు రంగు పూతపూసిన చైన్లు, 5 నిజమైన బంగారు ఆభరణాల ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని ధాభి వర్గానికి చెందిన ఈ నిందితులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో మోసాలకు పాల్పడ్డారు. వీరిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదైనాయి. నిందితులు ధాబి నారాయణ (50), ధాబి జీవన్ (29), ధాబి దయా (20), ధాబి నిమియా (25), బికిలి ధాబి (45), ధాబి రాజు (40), ధాబి శంకర్ (35), ధాబి సూరజ్ (20), సోలంకి లక్డి (38), ధల్లు బాయి (65)లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అంబేద్కర్‌నగర్, రాధాకృష్ణపురం, వేటపాలెం, చీరాలలో నివశిస్తున్నారు. కుటుంబంలోని చిన్నా, పెద్దా, ఆడ, మగ అంతా నేరాలు చేయడంలో ఆరితేరారు. అమాయకులను మోసం చేయడంలో దిట్ట. వీరంతా గ్రూపులుగా విడిపోయి నేరాలకు పాల్పడుతుంటారు.
కొన్ని ప్రాంతాలను ఎంచుకుని అక్కడ ఉన్న వారితో పరిచయం చేసుకుని తాము గుజరాత్, భోపాల్ ప్రాంతాలకు చెందిన వాళ్లమని చెబుతారు. ఇక్కడ తాము ఇళ్ల నిర్మాణంలో కూలీలుగా పని చేస్తున్నామని, తమకు డబ్బు అవసరం ఉందని చెప్పి అసలైన ఒకటి, రెండు గ్రాములు ఉన్న బంగారు ఆభరణాలను చూపించి ఎంతోకొంత రేటు కట్టి తీసుకుని డబ్బు ఇవ్వమని అడుగుతారు. అమాకంగా ఉన్న వారిని నమ్మించి కావాలంటే బంగారాన్ని పరీక్షించుకోమని చెబుతారు. అలా అడిగి తర్వాత రోజు ఫోన్‌లో సంప్రదించి బేరమాడతారు. నమ్మిన వాళ్లను అలా రోల్డ్ గోల్డ్, లేదా ఇమిటేషన్ గోల్డ్ వస్తువులను అంటకట్టి వారి నుంచి నగదు తీసుకుని ఉఢాయిస్తారు. ఇలాంటి కేసులు హైదరాబాద్‌లోని సైదాబాద్, అంబర్‌పేట, హబీబ్‌నగర్, మార్కెట్, సైబరాబాద్‌లోని కుషాయిగూడ, మీర్‌పేట్, మెదక్‌లోని సదాశివపేట, ఎపిలోని అనకాపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదయ్యాయి. నిందితులు స్వయంగా ఈ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. పోలీసుల దర్యాప్తులో మరికొన్ని చోట్ల ఈ ముఠా నేరాలకు పాల్పడినట్లు తేలింది. సైబరాబాద్ పరిధిలోని చందానగర్, కుకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఎపిలోని నాయుడుపేట, పాలకొల్లు, భీమ్లి, గాజువాక, తమిళనాడులోని అన్నానగర్, విల్లివక్కం, కొదంబక్కం, తిరువన్మియుర్, కేరళలోని కేశవదాస్‌పురం, పులయనర్‌కొట్ట ప్రాంతాల్లో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని సైదాబాద్ పోలీసులు తెలిపారు. తూర్పు మండల డిసిపి వి.రవీందర్ పర్యవేక్షణలో అదనపు ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో
ఒంటరి పోటీకి
వైకాపా నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 8: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఎన్నికల్లో వైకాపా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సారథ్యంలో హైదరాబాద్ పరిసరాలు బ్రహ్మాండమైన అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలను తీసుకురావడం, వౌలిక సదుపాయాల కల్పన, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం వైఎస్ హయాంలో చోటుచేసుకున్నాయన్నారు. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్‌గా వైఎస్ పాలనలోనే ఆవిర్భవించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.