తెలంగాణ

అగ్రిగోల్డ్ చైర్మన్‌పై అభియోగాలు కొట్టివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్ ఏ సీతారామారావుపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ హైకోర్టును కోరారు. ఈ కేసును జస్టిస్ ఏ శంకర్ నారాయణ విచారించారు. ఈ కేసులో సీతారామారావు అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి 2011లోనే రాజీనామా చేశారని, బోర్డు డైరెక్టర్లు ఫ్రాడ్‌కు పాల్పడినట్లు 2014లో బహిర్గతమైందన్నారు. పోలీసులు సీతారామారావుపై మూడు కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులో సీతారామారావు ఫ్రాడ్‌కు పాల్పడినట్లు పోలీసులు అభియోగం మోపడం తగదన్నారు. ఈ కేసులో ఏపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ, సిఐడి అధికారులతో చర్చించి తమ అభిప్రాయం తెలియచేస్తామన్నారు. అనంతరం ఈ కేసు విచారణ ఈ నెల 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.