తెలంగాణ

భేష్.. ఆంధ్రభూమి సంపాదకీయం .. సిఎం కెసిఆర్ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: సేంద్రీయ ఎరువుల అవసరం, వ్యవసాయంలో దాని ప్రాధాన్యత గురించి ఈనెల 17న ఆంధ్రభూమిలో ప్రచురితమైన సంపాదకీయం బావుందని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. ‘రైతు హిత’ పేరుతో హైదరాబాద్ (హెటెక్స్)లో మంగళవారం ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి వ్యవసాయ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ సేంద్రీయ ఎరువులు వాడటం వల్ల భూసారాన్ని రక్షించుకోవచ్చన్నారు. ఇదే విషయాన్ని సంపాదకీయంలో వివరించారన్నారు.
రైతులు- యాదవులు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. గొర్రెల, మేకల మందలను రైతులు తమ పొలాల్లో ఒకటి రెండురోజులు ఉండేలా చూసేవారని, వాటిద్వారా లభించే ఎరువులు పంటల ఉత్పత్తికి దోహదపడేవని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని గొర్రెలున్నాయో స్పష్టంగా తెలియదని సిఎం అన్నారు. 1.25 కోట్ల గొర్రెలున్నట్టు పశుసంవర్థక శాఖ డైరెక్టర్ చెప్పగా, 44 లక్షలున్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందన్నారు. యాదవులకు 84 లక్షల గొర్రెలు కొని ఇస్తున్నామని, దీంతో గొర్రెల సంఖ్య వచ్చే ఏడాదికి 1.5 కోట్లు అవుతుందని, రెండేళ్లలో ఆ సంఖ్య 5 కోట్లకు చేరుతుందన్నారు. గొర్రెల పెంపకం ద్వారా యాదవులకు 20 వేల కోట్ల రూపాయలు లభిస్తాయని, బంగారు తెలంగాణకు ఈరకంగా బాట వేసినట్టు అవుతుందన్నారు. ఒక ఎకరా స్థలంలో స్టైలో గడ్డి పెంచితే 50 గొర్రెలను పోషించవచ్చన్నారు. మామిడి, బత్తాయి తదితర పళ్లతోటల మధ్య స్టైలో గ్రాస్ పెంచడం వల్ల గొర్రెలకు మేత లభిస్తుందని, తోటలకు ఎరువు లభిస్తుందని వివరిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ అంటే ఇదేనన్నారు. రసాయన ఎరువుల వల్ల ఎదురయ్యే సమస్యల గురించి, సేంద్రీయ ఎరువుల వల్ల లభించే సత్ఫలితాల గురించి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.