తెలంగాణ

బంధుగణానికే పెద్దపీట?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14:జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అధికార తెరాస తొలి జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. ఎవరికి టికెట్ దక్కుతుంది..ముఖ్యంగా తొలి జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందన్న ఉత్కంఠ నేపథ్యంలో పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం 35మందితో విడుదల చేయబోతే తొలి జాబితాలో హోం మంత్రి నాయిని అల్లుడు, కె కేశవరావు, దివంగత పి.జనార్దన రెడ్డి కుమార్తెలకు టికెట్లు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీ అభ్యర్థుల ఎంపికకు పదును పెట్టింది. పార్టీ ఆశావాహులు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు, పార్టీ జరిపించిన సర్వే, గెలుపు గుర్రాలు, సామాజిక సమీకరణలు తదితర అంశాల ప్రాతిపదికగా ముందుకు వెళ్లబోతోంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పని చేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు కొందరు టికెట్లను ఆశిస్తున్నారు. వీరు ఆశిస్తున్న డివిజన్లలో విజయవకాశాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నట్టు పార్టీ నిర్వహించిన సర్వేలో తేలింది. పైగా పార్టీలోని ముఖ్యుల బంధుగణానికి తొలి విడత జాబితాలోనే టిక్కెట్లు ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించింది. వీరిని తప్పనిసరిగా ఎంపిక చేయాలని పార్టీ అధినేత కెసిఆర్ కమిటీకి సూచించారు. అలాంటి వారితో 35 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది. మొదటి విడత విడుదల చేయబోయే జాబితాను పార్టీ అధినేత ఆమోదం కోసం పంపించింది.
ఆ జాబితాలో ఉన్న వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ముఖ్యమంత్రి సూచించిన వారే కావడంతో కమిటీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు.
తొలి విడత విడుదల చేయనున్న జాబితాలో గుడి మల్కాపూర్ బండారి ప్రకాశ్ (తాజాగా బిజెపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన నేత), లంగర్‌హౌజ్ ఆర్ శైలజా, జియగూడ కృష్ణ, హిమాయత్‌నగర్ ఎ విజయలక్ష్మి, వెంకటేశ్వర కాలనీ పి విజయారెడ్డి (దివంగత పిజెఆర్ కూతురు), బేగంబజార్ రమేశ్ బాంగ్, రాంనగర్ శ్రీనివాస్‌రెడ్డి (హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు), చర్లపల్లి బొంతు రాంమోహన్ (టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు), బంజారాహిల్స్ గద్వాల విజయలక్ష్మి (కె కేశవరావు కూతురు), రహమత్‌నగర్ సతీష్‌రెడ్డి (మంత్రి కెటిఆర్ అనుచరుడు), చంపాపేట్ సామా రమణారెడ్డి (టిడిపి మాజీ కార్పొరేటర్) ఉన్నారు. వీరితో పాటు మరి కొందరికి తొలి విడత జాబితాలోనే టిక్కెట్టు ఖరారు చేసినట్టు తెలిసింది.