తెలంగాణ

హైదరాబాద్‌లో పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: అంతర్జాతీయ పంతగుల పోటీకి ఈసారి హైదరాబాద్ వేదికైంది. గురువారం ఆగాఖాన్ అకాడమీలో పర్యాటక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ పతంగుల పోటీలను తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. గతంలో ఈ పోటీలను గుజరాత్‌లో మాత్రమే నిర్వహించే వారని, హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి అని మంత్రి అన్నారు. ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా మలేషియా, టర్కీ, వియాత్నం, ఇండోనేషియాతో సహా ఆరు దేశాల క్రీడాకారులు హాజరయ్యారన్నారు. అలాగే అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడదోర, మంగళూరు, నాగ్‌పూర్ పట్టణాల నుంచి కూడా హాజరయ్యారని మంత్రి వివరించారు. పతంగుల పోటీలకు ఎప్పటి నుంచో హైదరాబాద్ నగరం ప్రసిద్ధిగాంచిందని, వీటికి అంతర్జాతీయ పోటీలను హైదరాబాద్‌లోనే ఎందుకు నిర్వహించకూడదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సూచించడంతో వీటిని నిర్వహిస్తున్నట్టు చందూలాల్ చెప్పారు. అనేక క్రీడలకు భవిష్యత్‌లో హైదరాబాద్ అంతర్జాతీయ వేదిక కాబోతుందని మంత్రి అన్నారు. ఐదు అడుగల నుంచి 50 అడుగుల వరకు వంద రకాల పతంగులను క్రీడాకారులు ఎగురవేయడంతో నగర వినువీధుల్లో పతంగులు సంక్రాంతి పండుగకు మరింత శోభను చేకూర్చాయి.

చిత్రం..సంక్రాంతి అంటే రంగురంగుల పతంగులు గగన తలంలో పోటాపోటీగా ఎగిరే అద్భుత విన్యాసం.
ఈసారి భాగ్యనగరం అంతర్జాతీయ పతంగుల పోటీకి వేదికగా మారింది.