తెలంగాణ

అల్లరి కాదు..అభివృద్ధి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో వేడి పెరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా రంగంలో దిగి టిఆర్‌ఎస్‌పై ముప్పేట దాడిని ముమ్మరం చేశారు. గురువారం కేంద్ర మాజీ మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, రేణుకా చౌదరి వేరు వేరుగా మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్మవద్దని, కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. టిఆర్‌ఎస్ మంత్రులు అల్లరి చేసేకంటే అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలని, చిల్లర ప్రచారాలను మానుకోవాలని జైపాల్ రెడ్డి హితవు పలికారు. తమ పార్టీ మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఆయన అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచామన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టును మంజూరు చేయడంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను కృషి చేశానన్నారు.
రూ. 14,132 కోట్లతో మెట్రోను మంజూరు చేశామన్నారు. రూ. 2463 కోట్లతో పట్టణ వౌలిక సదుపాయాల పథకాన్ని మంజూరు చేశామన్నారు. తమకు ప్రచారం తెలియదని, టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలకు ఆర్భాటం తప్ప మరేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాలను హైదరాబాద్‌కు రప్పించేందుకు రూ. 600 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. ఆర్టీసి ద్వారా 1400 బస్సులు నగరానికి ఇచ్చామన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన పనులన్నింటిని తామే చేసినట్లు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నేతల మాటల వలలో చిక్కుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. అతిగా ప్రచారం చేసుకోవడం టిఆర్‌ఎస్‌కు అలవాటని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 78వేల ఇళ్లు కట్టామన్నారు.
సెటిలర్ల వల్లే అభివృద్ధి: రేణుకాచౌదరి
హైదరాబాద్ పరిసరాల్లో స్థిరపడిన సెటిలర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి అన్నారు.
గురువారం ఆమె గాంధీ భవన్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో సెటిలర్లను దూషించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు క్షమాపణ చెప్పాలన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలవకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించిన కె.తారకరామారావు ముందుగా మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని నాగళ్లు, ట్రాక్టర్లతో దున్నిస్తానంటూ అయ్యప్ప సిటీ భవనాలను కూల్చడం వల్లనే సెటిలర్లలో అభద్రతా భావం పెరిగిందన్నారు. సెటిలర్లకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ అన్నారు.

గురువారం గాంధీభవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి
ఎస్ జైపాల్ రెడ్డి. పక్కన టిపిసిసి అధ్యక్షుడు