తెలంగాణ

ఇటు ఫుల్..అటు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులు ఖాళీగా తిరిగి వెళ్తున్నాయి. పండుగను తమతమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యంకోసం హైదరాబాద్ నుంచి వందల సంఖ్యలో బస్సులను విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు నడిపారు. గత నాలుగురోజుల నుండి ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లేటప్పుడు ప్రయాణికులతో కిక్కిరిసిపోయినప్పటికీ తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రయాణికులు లేక వెలవెలబోతూ కనిపించాయి. బుధ, గురువారాల్లో సుమారు 500 మంది బస్సులు సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌కు రాగా వాటిలో సగం బస్సుల్లో ఒక్కరు కూడా ప్రయాణికులు కనిపించలేదు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న బస్సులు స్థానిక బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపు నిలిపినా ప్రయాణికులు జాడ కనిపించకపోవడంతో అధికశాతం బస్సులు ఖాళీగానే హైదరాబాద్‌కు వెళ్లిపోయాయి. బస్సులు ఖాళీగా ఉండడంతో డ్రైవర్లు, కండక్టర్లు బస్టాండ్‌తోపాటు రోడ్డుపై నలుగురు కనిపిస్తే బస్సులు నిలిపి హైదరాబాద్...హైదరాబాద్.. అంటూ కేకలు వేసి పిలిచినా వచ్చేవారు కరవయ్యారు. మరికొంతమంది డ్రైవర్, కండక్టర్లు హైదరాబాద్‌తోపాటు మార్గమధ్యలోని గ్రామాల్లోను ఆపుతామంటూ కొందరు ప్రయాణికులను తీసుకెళ్లడం కనిపించింది.
అదే సమయంలో విజయవాడ వైపు వెళ్లే బస్సుల్లో మాత్రం ప్రయాణికుల రద్దీ అధికంగానే కనిపించింది. గత రెండురోజులుగా అన్ని బస్సులు కిటకిటలాడుతూ వెళ్లగా గురువారం మాత్రం ప్రయాణికుల సంఖ్య కొంత తక్కువగా కనిపించింది. ప్రత్యేక బస్సుల్లో చార్జీలను కూడా అధికంగా వసూలు చేసి దోచుకున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుండి విజయవాడకు రూ.280లు చార్జీ ఉండగా ప్రత్యేక బస్సుల పేరుతో ఒక్కో డిపోకు ఒక్కో విధంగా రూ.500ల నుండి 700వరకు వసూలు చేశారు. దీంతో ప్రైవేటుకు, ఆర్టీసీకి పెద్దగా తేడా ఏమీలేదంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. అవే బస్సుల్లో తిరుగు ప్రయాణంలో మాత్రం మాములు చార్జీనే తీసుకున్నట్లు కండక్టర్లు తెలిపారు. ప్రతినిత్యం ప్రయాణికులతో సందడిగా ఉండే హైటెక్‌బస్టాండ్‌ల బస్సుల చప్పుడు మాత్రమే వినిపించింది. హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు రద్దీ అధికంగా ఉండడంతో సంతోషించిన ఆర్టీసీ తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ తర్వాత ప్రస్తుత పరిస్థితి తారుమారవుతుందని డ్రైవర్, కండక్టర్లు పేర్కొన్నారు.

చిత్రం..

హైదరాబాద్‌కు వస్తున్నఒక బస్సులో ప్రయాణికులెవరూ లేని దృశ్యం