తెలంగాణ

ప్రశాంతంగా పల్లె‘టూర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 14: పల్లె‘టూర్’ ప్రశాంతంగా సాగింది. హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి సంక్రాంతి తాకిడి పెరిగింది. సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు రాజధాని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వాహనాలలో తరలివెళ్లడంతో హైవే కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 17 వేల వాహనాలు వెళ్తుండగా పండుగ సందర్భంగా రెట్టింపయ్యాయి. అడుగడుగునా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్‌ను సుగుమం చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. టోల్‌ప్లాజా వద్ద వాహనాలు జామ్ కాకుండా జిఎంఆర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనుపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదనపు టోల్‌వేలను తెరిచారు. ఆంధ్రాకు వెళ్లే ప్రజలు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా పల్లె‘టూర్’ సాగడంతో పోలీసులు, జిఎంఆర్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సాయంత్రానికి సాధారణ పరిస్థితి నెలకొంది. అధికారులు, సిబ్బంది సంక్రాంతి పండుగ సంబరాలలో నిమగ్నమయ్యారు.
ఆదివారం నుంచి సంక్రాంతికి వెళ్లిన ఆంధ్ర ప్రజలు తిరుగు పయనమవుతుండడంతో హైదరాబాద్ వైపు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా పట్నం టూర్ సాగేందుకు పోలీసు, జిఎంఆర్ అధికారులు బిజీ అయ్యారు.

చిత్రం.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన
వాహనాలు