తెలంగాణ

రాజకీయ పార్టీల గ్రేటర్ ఫీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: మినీ కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్ధుల ఖరారులో టిడిపి-బిజెపి కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక తంటాలు పడుతోంది. ఇక వైకాపా బరిలోకి దిగకముందే తప్పుకుంది. ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టిడిపి శ్రేణుల్లో కదనోత్సాహం కరవైతే, వైకాపా శ్రేణులు పార్టీ ప్రకటనతో నిరాశలో పడిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుని పుంజుకున్న కాంగ్రెస్ మాత్రం తొడ చరిచి బరిలోకి దిగింది. సంక్రాంతి రోజు మొదటి విడత అభ్యర్ధుల జాబితా ఖరారు చేయనుంది. 2009 ఎన్నికల్లో పోటీ చేయని టిఆర్‌ఎస్ పార్టీ ఈసారి అటు ప్రచారంలోనూ, ఇటు వ్యూహ ప్రతి వ్యూహాల్లోనూ దూసుకుపోతోంది. మజ్లిస్ పార్టీ మాత్రం హడావుడికి దూరంగా ప్రచారం సాగిస్తోంది. 17వ తేదీన నామినేషన్ల పర్వం ముగుస్తోంది. ఎన్నికల తీరును విశే్లషిస్తే 150 డివిజన్లలో సగం డివిజన్లలో ముక్కోణపు పోటీ, మరో సగం డివిజన్లలో చతుర్ముఖ పోటీ జరగడం ఖాయం. మజ్లిస్ పార్టీ పోటీ చేసే చోట చతుర్ముఖ పోటీ ఉంటుంది.
కదనోత్సాహం కరవు
టిడిపి-బిజెపి ఆధ్వర్యంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగం కార్యకర్తలకు ఉత్తేజం ఇవ్వడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీపై ఏ మాత్రం విమర్శలు చేయకుండా, టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని మాత్రమే ఏకరవు పెట్టడం పట్ల కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఎనిమిది నెలల కిందట మహానాడులో టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడిన బాబుకు, ఇప్పటి బాబుకు ఎంత తేడా అని కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. ఓటుకు నోటు స్కాంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు తెలంగాణ ఏసిబి అభియోగాలు మోపడం వల్ల చంద్రబాబు టిఆర్‌ఎస్‌పై దూకుడును తగ్గించారనే భావన ప్రజల్లో నెలకొని ఉంది. మరోవైపు చంద్రబాబు వైఖరిపై బిజెపిలో అంతర్మథనం ప్రారంభమైంది. బిజెపి కార్యకర్తలు మాత్రం తమ పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేసే విధంగా వ్యూహ రచన చేయాలని, నగరంలో పట్టున్న ప్రాంతాలు వదులుకోరాదని పార్టీపై వత్తిడి తెస్తున్నారు. ఇంతవరకు సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు.
సెటిలర్లకోసం పాట్లు
ఇక టిఆర్‌ఎస్ విజయానికొస్తే, గెలుపు బాధ్యతలు భుజంపై వేసుకున్న మంత్రి కెటిఆర్ సెటిలర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సెటిలర్లపై మాటల తూటాలు పేల్చినా, అదంతా గతమని, సెటిలర్లకు అండగా ఉంటామని, గత 18 నెలల్లో చీమంతా హాని కూడా జరగకపోవడమే ఇందుకు ఉదాహరణ అని చెబుతూ సెటిలర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పూర్వవైభవం కోసం పాకులాట
రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం అన్ని శక్తులు పణంగా పెట్టి పోరాడుతోంది. టిఆర్‌ఎస్‌తో సరిసమానంగా కాకపోయినా, ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. దిగ్విజయ్‌సింగ్, జైపాల్ రెడ్డి లాంటి పెద్ద నేతలు రంగంలోకి దిగారు. టిపిసిసి అధినేత ఉతమకుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వస్తున్నారు. ప్రధానంగా మజ్లిస్‌తో కాంగ్రెస్ పార్టీ తెగతెంపులు చేసుకోవడం కలిసి వచ్చిన పరిణామం.
పాత హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో మైనార్టీలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. టిఆర్‌ఎస్‌కు టిడిపి-బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమనే సంకేతాలు బలపడితే, సెటిలర్లలో టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. పాతబస్తీకే మజ్లిస్‌పార్టీ పరిమితమవుతుందనేకుంటే పప్పులో కాలేసినట్లే. ఆ పార్టీ ముస్లిమేతరులకు పెద్ద సంఖ్యలో సీట్లను ఇవ్వబోతోంది. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా, 150 సీట్లలో కనీసం 40 సీట్లను సొంతంగా గెలుచుకునే మజ్లిస్ పార్టీ వినూత్న శైలిలో ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటోంది.