తెలంగాణ

ఉపాధి పనుల్లో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 27: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం శివారులో శుక్రవారం ఉపాధి పనులు చేస్తుండగా విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. దేవలమ్మ నాగారం నుంచి అల్లాపురం రోడ్డు వరకు ఉపాధి పనులతో రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. రోడ్డుకు మట్టిని పోసేందుకు ఉపాధి కూలీ బొమ్మ పెంటయ్య గడ్డపలుగు వేస్తుండగా రాయి తగిలింది. అనుమానం వచ్చి మరింత లోతుగా తవ్వడంతో విగ్రహం బయటపడింది. విష్ణుమూర్తి విగ్రహంగా గుర్తించారు. మూడు అడుగుల ఎత్తు ఉన్న విష్ణుమూర్తి విగ్రహన్ని అక్కడే ప్రతిష్ఠించి ఉపాధి కూలీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 13వ శతాబ్దంలో రాచకొండను పాలించిన రేచర్ల పద్మనాయక వంశీయులు సింగభూపాలుడి హయాంలో దేవలమ్మనాగారం చెర్వును తవ్వించారు. అప్పట్లో అక్కడే దేవాలయాలను నిర్మించి శ్రీ సీతారాముల విగ్రహలతో పాటు పలు విగ్రహాలను ప్రతిష్ఠించారు. కాలక్రమేణా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో శ్రీసీతారాముల విగ్రహాలను తీసుకువచ్చి గ్రామంలో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు. అప్పట్లో అక్కడ ప్రతిష్ఠించిన వాటిలో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం అయి ఉంటుందని భావిస్తున్నారు. విష్ణుమూర్తి విగ్రహం బయటపడటంతో ఉపాధి కూలీలు ప్రత్యేక పూజలు చేశారు.

దేవలమ్మ నాగారంలో బయటపడిన
విష్ణుమూర్తి విగ్రహం