తెలంగాణ

14న గుంటూరులో జనసేన ఆవిర్భావ మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభను ఈ నెల 14న గుంటూరులో లాంఛనంగా ప్రారంభించనున్నట్టు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ శుక్రవారం నాడు తెలిపారు. జనసేన ఆవిర్భావం రోజు, జనసేన సైనికులమైన అందరికీ పండుగ రోజని, ప్రజాస్వామ్యవాదులకు వేడుకైన రోజని, జనసేన అభిమానించే అందరూ ఒక చోట కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల సేవకు పునరంకితం అయ్యే రోజు అని, జనసేన సిద్ధాంతాలు, నాలుగేళ్ల ప్రయాణంపై ప్రజావేదిక నుండి మాట్లాడే తరుణం ఆసన్నమైందని పవన్ పేర్కొన్నారు.
నాలుగేళ్లనాటు హైదరాబాద్‌లో పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుండి సాగిన ప్రస్థానంపై పార్టీ అభిమానులు, నాయకులతో గుంటూరులో సభ నిర్వహిస్తామని అన్నారు. నాగార్జున వర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మహాసభ జరుగుతుందని, 35 ఎకరాల విస్తీర్ణంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. భారీ వేదిక నిర్మాణమవుతోందని, రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పార్టీ అభిమానులు, జనసైనికులు మహాసభకు భారీగా తరలివస్తున్నట్టు అందుతున్న సమాచారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
సభ ప్రాంగణంలో రక్షణ, ఇతర వసతులు, సభ ప్రతి ఒక్కరికీ కనిపించేలా చర్యలు తీసుకుంటున్నామని, బారికేడింగ్ తదితర పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయని చెప్పారు. సభ నిర్వహణకు సంభబంధించిన అంతర్గత కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయని, 14వ తేదీ మధ్యా హ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ఘనంగా ప్రారంభమవుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల కోసం త్యాగాలు, అనితర సేవలు అందించిన నాయకులను స్మరించుకునేలా సభా ప్రాంగణానికి , స్వాగతతోరణాలకు పేర్లు ఉంటాయని పవన్ వివరించారు. ఈ కార్యక్రమం సమన్వయం కోసం విజయవాడలోని వినాయక థియేటర్ ఎదురుగా భారతీనగర్‌లో కార్యాలయం ప్రారంభమైందని చెప్పారు.
నేడు నివేదిక
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం చేసిన అధ్యయనం చేసిన నిజనిర్థారణ సంయుక్త కమిటీ (జేఎఫ్‌సీ) నివేదికను పవన్‌కళ్యాణ్ శనివారం నాడు విడుదల చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చలేదని సంయుక్త కమిటీ నివేదికపై కొన్ని మార్పులు, చేర్పులు చేసి క్లుప్తంగా ప్రజల ముందుంచనున్నారు. ప్రభుత్వం అడిగిన మేర కేంద్రం నిధులను ఇవ్వలేదని ఆ నివేదిక వివరించింది.