తెలంగాణ

కేటాయంపులు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు 9.303 టిఎంసి, తెలంగాణకు 24.467 టిఎంసి నీటిని విడుదల చేస్తూ కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ పరమేశం తెలిపారు. ఈనెల 20 వరకు నాగార్జునసాగర్‌లో 520 అడుగుల నీటి మట్టానికి తగ్గకుండా జలాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఉభయ రాష్ట్రాలూ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్న రెండు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. శ్రీశైలం రిజర్వాయరర్ నుంచి కుడి విద్యుత్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈనెల 31 వరకు నాగార్జునసాగర్‌లో 515 అడుగులకు తగ్గకుండా నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకునే విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. విద్యుత్ హౌస్‌ల ద్వారానే రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతారని, దీని వల్ల విద్యుదుత్పత్తి కూడా అవుతుందన్నారు. ఒకవేళ విద్యుత్ అవసరం లేకపోతే స్లూయిస్‌ల ద్వారా నీటిని వదిలేందుకు నిర్ణయంచామన్నారు. రెండు రాష్ట్రాల సాగునీటి ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసేలా చర్చలు జరిగాయన్నారు. 2017-18 సంవత్సరానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు లభ్యతలో ఉన్న నీటిలో 66:34 నిష్పత్తిలో వినియోగం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టునాటికి 46 టీఎంసీ కావాలని తెలంగాణ, 30.38 టీఎంసీ నీరు మేనాటికి అవసరమవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కోరాయన్నారు.
శ్రీశైలంలో 61 టీఎంసీకి పడిపోయిన నీటి నిల్వ
ఇదిలావుంటే, శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ 61 టీఎంసీకి పడిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీ కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి నీటిమట్టం 839.50 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 61 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడం లేదు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జలవిద్యుత్కేంద్రంలో 140 మెగావాట్ల సామర్థ్యంతో మూడు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టారు. ఇందుకోసం జలాశయం నుండి 20,130 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. ఆ నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. జలాశయం బ్యాక్ వాటర్ నుండి హంద్రీనీవాకు 1350 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 494 క్యూసెక్కులు, తెలంగాణ ప్రాంతంలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు మొత్తం 22,437 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రెండు జల విద్యుత్కేంద్రాల్లో 4.416 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి 9,367 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

chitram...
శ్రీశైలం జలాశయం