తెలంగాణ

ఫార్మాకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: లైఫ్ సైనె్సస్ రంగాన్ని రాష్ట్రంలో మరింత అభివృద్ధి పర్చడానికి విజన్- 2030 పేరిట ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి పర్చడం వల్ల అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీతో మంత్రి కేటీఆర్ నోవాటెల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఈ రంగానికి ఉన్న అవకాశాలు, అభివృద్ధిపైనా అడ్వయిజరీ కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మారంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా ఎంచుకోవడంతో పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి పర్చాలనే అంశంపై ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో చర్చించినట్టు చెప్పారు. సదస్సులో వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలో చేర్చనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో లైఫ్ సైనె్సస్ రంగంలో రాష్ట్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం వల్ల అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తాయన్నారు. లైఫ్ సైనె్సస్ రంగంలో వస్తున్న డిజిటల్ మెడిసిన్, ఫార్మారంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లో లైఫ్ సైనె్సస్ ఎకో సిస్టమ్స్‌ను మరింత అభివృద్ధి పరుస్తున్నామన్నారు. దీని కోసం పరిశోధన, శిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ రంగంలో పరిశోధనల కోసం టి-హబ్ మాదిరిగా ప్రత్యేకంగా ఒక ఇంక్యుబేటర్‌ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, సిసిఎంబి వంటి పరిశోధన సంస్థల మధ్య మరింత సమన్వయం సాధించడానికి రిచ్ (ఆర్‌ఐసిహెచ్) ప్రయత్నిస్తుందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో పరిశోధనలకు స్టార్టప్స్, హైరిస్క్ రీసెర్చ్‌కు ప్రోత్సాహం కల్పించడానికి ఒక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్‌లో దీనికి నిధుల కేటాయింపు కోసం ప్రతిపాదిస్తామన్నారు. ఈ రంగంలో సంస్థల భాగస్వామ్యంతో పాఠశాల స్థాయి నుంచి కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతుందన్నారు. ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీని నియమించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

chitram...
జీవశాస్త్ర సలహా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఐటీ మంత్రి కేటీఆర్