తెలంగాణ

రూట్‌మ్యాప్ వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగిఉన్న దేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విధానాలు, పద్ధతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణలు తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, క్రియ స్వచ్ఛంద సంస్థ సిఇవో డాక్టర్ బాలాజి ఊట్లతో పాటు పలువురు రిటైర్డు అధికారులతో సిఎం సమాలోచనలు జరిపారు.
కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో వీరితో సిఎం సమావేశయ్యారు. దేశంలోని అన్ని వర్గాలు దీంట్లో భాగస్వామ్యం కావాలని సిఎం పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఆశించిన మేరకు పురోగతి సాధించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నా, దేశంలో మాత్రం ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా నేటికి తీరడం లేదన్నారు. దేశ ప్రజలందరికీ మంచినీరు, విద్యుత్, సాగునీరుతో పాటు కనీసం వౌలిక సదుపాయాల కల్పన కూడా జరగడం లేదన్నారు. చాలా రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఉన్నా పరిష్కారం లభించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదని సిఎం కేసిఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. సహకార సమాఖ్య స్ఫూర్తి పూర్థిస్థాయిలో ప్రతిబింభించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించిందన్నారు. ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈపథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో పాటు ఇంకా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను రూపొందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ శాఖ ఎవరి వద్ద ఉండాలన్నది నిర్ణయం జరగాలన్నారు. ఉమ్మడి జాబితా అమలులో ఉండటం వల్ల ఒకేశాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు దీని వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిసిథతులు ఉన్నాయన్నారు. వాటికి అనుగుణంగా రిజర్వేషన్లను కల్పించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం ఉండాలన్నారు. న్యాయ, పాలనా, శాసన వ్యవస్థల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో తీసుకరావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్టాలు, రాజ్యాంగ సవరణలపై స్పష్టమైన ఎజెండా రూపొందించాలని రిటైర్డు అధికారులను సీఎం కోరారు.