తెలంగాణ

పర్యావరణ పరిరక్షణలో సింగరేణి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13 పర్యావరణ పరిరక్షించడంలో సింగరేణి ముందు వరుసలో ఉంటుందని అందుకు సింగరేణి థర్మల్ ప్లాంట్ వద్ద చేపట్టిన చర్యలు అందుకు తార్కానమని సింగరేణి సిఎండి శ్రీ్ధర్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో తమ సంస్థ పర్యావరణ కోసం చేపడుతున్న అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ థర్మల్ ప్లాంట్ వద్ద వస్తున్న వ్యర్థాలను మరోరకంగా వినియోగించుకోవడంలో సింగరేణి ప్రశంశలు అందుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బొగ్గు మండించగా విడుదలయ్యే బూడిద వలన పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా అత్యాధునిక పద్దతులను ఇక్కడ అమలు చేస్తున్నామన్నారు. ‘యాస్’ను సద్వినియోగపర్చడంలో విజయవంతం అయ్యామని చెప్పారు. యాస్‌ను ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిలేటర్ల ద్వారా స్వీకరిస్తూ గాలిలోకి ధూళి ఏమాత్రం విడుదల కాకుండా పూర్తి జాగ్రతలు తీసుకున్నామని చెప్పారు. ఈ విధంగా తీసుకున్న బూడిదను ప్లైయాస్ అంటారని, ఇది 53 మైక్రాన్ల కన్నా కాస్త ఏక్కువ పరిమాణం గల బూడిదను ఫర్నేసుల వద్ద కిందకిదిగి నిక్ష్లిప్తమై ఉంటుందన్నారు. దీనిన బాటం యాస్ అంటారు. బాటం యాస్ నీటి తేమతో కలిపి స్లర్రీ రూపంలో ఉంటుందన్నారు. ఈ రెండు రకాల బూడిదలను సింగరేణి సద్వినియోగం చేసుకుంటుందని చెప్పారు. ప్లైయాస్‌ను ఏలక్ట్రో ప్రేసిపిటేటర్ హాస్పర్ల నుండి ప్లైయాస్ స్టోరేజి సైలోలకు పంపిస్తామని, ఇలా సైలోకి చేరిన ప్లైయాస్‌ను సిమెంట్, ఇటుకల తయారీ పరిశ్రమల వారికి ఉచితంగా ఇస్తామన్నారు. సిమెంట్ తయారీలో ప్లైయాస్‌ను విరివిగా ఉపయోగిస్తారని, సిమెంట్‌లో 30 శాతం వరకూ ప్లైయాస్ వినియోగ్తిమని, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా రోజుకి 4,000 టన్నుల ప్లైయాస్ వివిధ పరిశ్రమలకు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు.