తెలంగాణ

సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: మేడ్చల్ జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ నేనావత్ కిషన్ ప్రసాద్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు బుధవారం అరెస్టు చేశారు. రెండు చోట్ల ఇళ్ళు, రెండు చోట్ల ఇళ్లస్ధలాలు, ఒక చోట వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ రూ.4,38,000, నగదు రూ.1,47,000, రూ.12 లక్షల కారు, ఎల్‌ఐసి పాలసీలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన ఆస్తుల విలువ డాక్యుమెంట్ ప్రకారం రూ.1.01 కోట్లు ఉండగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.