తెలంగాణ

58 లక్షల మంది రైతులకు బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఆగస్టు 15 వతేదీ నుండి ఇది అమలులోకి వస్తుందని రాష్టవ్య్రవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్‌కు దక్కుతుందన్నారు. 35వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించామన్నారు. 1.50కోట్ల ఎకరాల భూమిలో రైతులు కష్టపడి పనిచేస్తే లక్షా 25వేల కోట్ల రూపాయల పంటల దిగుబడి సాధించడం ద్వారా దేశంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
రాష్ట్రంలో 1.68లక్షల మంది రైతు సమన్వయ సమితి సభ్యులు, 2,638మంది ఎఇఒలు, 280మంది ఎఒలు, 200మంది ఎడిఎలు, 30మంది జెడిఎలు రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుబంధు పథకం ద్వారా 98.24 శాతం సన్న, చిన్నకారు రైతులు లబ్ధిపొందినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 25ఎకరాల పైబడిన పెద్ద రైతులు 6,488మంది (0.11%)మాత్రమే ఉన్నారన్నారు. రైతుబంధు లబ్ధిదారులకు ఆగస్టు 15నుండి 5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు ఒక్కొక్క రైతు పేరున 2,271రూపాయలను తమ ప్రభుత్వం ఎల్‌ఐసికి చెల్లిస్తుందన్నారు. రైతు బీమాను జూన్ 30లోగా పూర్తిచేసి, జూలై 15లోగా ఎఇఒలు డేటాను నిక్షిప్తంచేసి ఎల్‌ఐసికి అందజేయాలన్నారు.
రైతుబీమా కార్యక్రమం ద్వారా 1500కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రతిరైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. 45వేల కోట్లతో మిషన్‌భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరందించేదుకు పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.