తెలంగాణ

నెలాఖరే గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలో జాతీయ రహదారుల భూ సేకరణను ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం కలక్టర్లతో జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ రహదారులు సకాలంలో పూర్తి చేయడానికి భూ సేకరణనే కీలకమైన అంశమన్నారు. సకాలంలో భూ సేకరణ జరుగలేదని సిఎస్ జోషి అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎట్టిపరిస్థితులలో ఈ నెలాఖరు వరకు భూ సేకరణ పూర్తి కావాలన్నారు. తిరిగి ఇదే అంశంపై మరోసారి సమావేశం నిర్వహించే సరికి భూ సేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్) నంబర్-161 సంగారెడ్డి, నాందేడ్, అకొలాకు సంబంధించి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి కలక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని సిఎస్ ఆదేశించారు. ఎన్‌హెచ్ నంబర్-163 మనె్నగూడకు సంబంధించి రంగారెడ్డి కలక్టర్, ఎన్‌హెచ్ నంబర్-167 జడ్చర్లకు సంబంధించి మహబూబ్‌నగర్ కలక్టర్, ఎన్‌హెచ్ నంబర్-363 మంచిర్యాల, చంద్రాపూర్‌కు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్ కలక్టర్లు, ఎన్‌హెచ్ నంబర్-563 సంబంధించి జగిత్యాల, కరీంనగర్, వరంగల్ కలక్టర్లు, ఎన్‌హెచ్ నంబర్-365కు సంబంధించి సూర్యాపేట కలక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించి భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు.
వచ్చే నెలలో 4వ విడత హరితహారం
జూలై రెండవ వారంలో రాష్టవ్య్రాప్తంగా నాలుగవ విడత హరితహారాన్ని నిర్వహించనున్నట్టు సిఎస్ చెప్పారు. హరితహారంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. రాష్టస్థ్రాయిలో ఈ నెల 25, 28 తేదీలలో శిక్షణా కార్యక్రమం జరుగుతుందన్నారు. వీటిలో డిపిఓ, డిఎఫ్‌ఓ, మున్సిపల్, డిఆర్డీడివో, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొంటారన్నారు. వీరే ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గత హరితహారంలో నాటిన మొక్కలలో ఎన్ని బతికిందీ థర్డ పార్టీతో సర్వే చేయిస్తామన్నారు. ఈ సారి హరితహారంలో మొత్తంగా 39 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించడంలో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయన్నారు.