తెలంగాణ

మసకబారుతున్న తెలుగు మాధ్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రోజురోజుకూ తెలంగాణలో తెలుగుమాద్యమం మసకబారుతోంది. ప్రాధమిక పాఠశాలలు మొదలు , జూనియర్ కాలేజీల్లో తెలుగు మాద్యమం పాఠశాలలకు ప్రాధాన్యత తగ్గి ఆంగ్ల మాద్యమంవైపు విద్యార్థులు తరలివెళ్తున్నారు. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు ఉన్న గిరాకీ తెలుగుమాద్యమంలోని స్కూళ్లకు ఉండటం లేదు. అదేపరిస్థితి జూనియర్ కాలేజీల్లోనూ ఏర్పడింది. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల జూనియర్ కాలేజీలకు ఉన్న గిరాకీ తెలుగు మీడియం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉండటం లేదు. చివరికి డిగ్రీ కాలేజీల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ కాలేజీల్లో నాలుగు లక్షలకు పైగా సీట్లు ఉండగా, ఇంత వరకూ జరిగిన రెండు విడతల అడ్మిషన్లలో 1.51 లక్షల మంది సీట్లు దక్కించుకోగా, అందులో ఆంగ్ల మాద్యమంలో 1,25,885 మందికి సీట్లు లభించగా, తెలుగు మాద్యమంలో కేవలం 24,766 మందికే సీట్లు వచ్చాయి. అరబిక్ మాద్యమంలో ఒకరికి, ఉర్దూ మాద్యమంలో 937 మంది, హిందీ మాద్యమంలో 14 మందికి సీట్లు లభించాయి.
దోస్త్ రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి , దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, సాంకేతిక , ఉన్నత విద్యాశాఖల కమిషనర్ నవీన్ మిట్టల్, మండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటరమణలు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. దోస్త్‌లో రెండు విడతల్లో 1,51,603 సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు చెప్పారు. బీకాంలో 56,876, బిఎస్సీలో 74,923, బిఎలో 17073, బీబీఏలో 2075, బీబీఎంలో 284, బీసీఎలో 307 మంది, బిఎ వొకేషనల్‌లో 37, బిఎస్‌డబ్ల్యులో 28 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన వారిలో తొలి విడతలో అమ్మాయిలు 51,691 మంది కాగా, రెండో విడతలో 34,454 మంది , అబ్బాయిలు తొలి విడతలో 25,987 మంది, రెండో విడతలో 36,471 మంది పొందారు. ప్రభుత్వ కాలేజీల్లో 36,495 మంది కాగా, ప్రైవేటు ఎయిడెడ్‌లో 9002 మంది, రైల్వే కాలేజీల్లో 3413 మంది, ప్రైవేటు అన్ ఎయిడెడ్‌లో 1,01,571 మంది, ప్రైవేటు అటానమస్‌లో 995 మంది సీట్లు పొందారు. తొలి దశలో సీట్లను నిర్ధారించిన వారు 80,678 మంది కాగా, రెండో దశలో సీట్లు పొందిన వారు స్లయిడింగ్‌తో సహా 70,925 మంది ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల వరకూ తీసుకుంటే తొలి దశలో 17,445 మంది రెండు దశలో 19046 మంది చేరారు. గత ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో 29వేల మంది చేరగా, ఈ ఏడాది ఆ సంఖ్య మరో ఏడు వేలు పెరిగింది. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. కాగా 44 కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు జరిగాయని, 144 కాలేజీల్లో 25కు మించి విద్యార్ధులు చేరలేదని, వాటి నిర్వహణ ఆర్ధిక భారంతో కూడుకున్నదేనని, వారిని ఏం చేయాలనేది యాజమాన్యాలే తేల్చుకోవాలని నవీన్ మిట్టల్ చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య కొన్ని మార్లు ముఖ్యం కాబోదని, శివారు ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, కాలేజీలను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అవుతుందని అన్నారు. ఇక 25 నుండి 50లోపు విద్యార్ధులు చేరిన కాలేజీల సంఖ్య 178 ఉందని చెప్పారు. 218 కాలేజీల్లో కేవలం 51 నుండి వంద లోపు మాత్రమే విద్యార్థులు చేరారని పేర్కొన్నారు.
జూన్ 20 నుండి 26వ తేదీలోగా అభ్యర్ధులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, కొత్తగా రిజిస్ట్రేషన్ చేయదల్చిన వారు కూడా ఈ నెల 20 నుండి 25వ తేదీలోగా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. అదే సమయంలో విద్యార్థులు స్లయిడింగ్‌కు కూడా వెళ్లవచ్చని పేర్కొన్నారు. సీట్లు వద్దనుకున్నవారు ఈ నెల 26లోగా చెబితే ఫీజును వారికి వెనక్కు ఇస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. దోస్త్ ద్వారా సీట్లు దక్కించుకున్న వారిలో బీసీలు 41,127 మంది, ఒసీలు 11,577 మంది, ఎస్సీలు 11,898 మంది, ఎస్టీలు 6323 మంది ఉన్నారని వివరించారు.