తెలంగాణ

ఆగస్టులోగా పూర్తి కావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: పట్టణ ప్రాంతాలలో మిషన్ భగీరథ పనులు వచ్చే ఆగస్టు వరకు పూర్తి చేయాలని వర్కింగ్ ఏజన్సీలను మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంగళవారం బేగంపేట మెట్రోరైలు భవన్‌లో సంబంధిత అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. చాలా పట్టణాలలో ఇప్పటికే మిషన్ భగీరథ పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వర్కింగ్ ఏజెన్సీలు వ్యక్తం చేసాయి. వర్షాలు ఇప్పటికే ఆరంభమైనప్పటికీ చాలా మటుకు సివిల్ వర్క్స్ పూర్తి కావడంతో పెద్దగా ఇబ్బందేమి లేదని మంత్రి అన్నారు. ఆగస్టు వరకు పైపులైన్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు వివరించారు. వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న పనులుకూడా అక్టోబర్ వరకు పూర్తి చేస్తామని తెలిపారు. పైపులైన్ల నిర్మాణం కోసం తవ్విన రహదారులను వెంటనే పూడ్చి వేయాలని, లేనిపక్షంలో ప్రజలు ఇబ్బంది పడుతారని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో పెరిగిన మున్సిపాల్టీలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఇ-ఎన్-సిని మంత్రి ఆదేశించారు. ఈ శాఖను మరింత బలోపేతం చేయాలన్నారు. టియుఎఫ్‌ఐడిసి ద్వారా చేపట్టనున్న పనుల సమగ్ర నివేదికలను (డిపిఆర్) మంత్రి పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి కలక్టర్లతో చర్చించాల్సిందిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. ప్రత్యేక నిధులతో చేపట్టే పనులను ఆరు నెలల్లో పూర్తి చేసే విధంగా టెండర్లలోనే గడువు విధించాలని మంత్రి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాల్టీలలో కనీస వౌలిక వసతుల ఏర్పాటుపై ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి కేటిఆర్ సూచించారు.