తెలంగాణ

నకిలీ క్లబ్‌తో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: నకిలీ క్లబ్‌ను సృష్టించి వందలాదిమంది అమాయకులను సభ్యత్వం పేరుతో రూ.9 కోట్ల మొత్తాన్ని వసూలు చేసి ఇద్దరిని టాస్క్ఫోర్స్ అరెస్టు చేసింది. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్, అండ్ సర్వీసెస్ పేరుతో నకిలీ సంస్ధను ఏర్పాటు చేసి దానిలో క్లబ్ సభ్వత్వం, హోలిడే మెంబర్ షిప్, హెల్త్ మెంబర్‌షిప్, సిల్వర్ కాయిన్, కాంప్లిమెంటరీ ప్లాట్, రిసార్ట్స్‌లో రాయితీలు వంటి వాటిని ఎరవేసి భారీగా దోచేశారు. ఈ కేసులో షేక్ ఖాదర్ భాషా (34), పానగంటి విజయకుమార్ (37)లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.8.15 లక్షల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2017 జూన్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఇద్దరూ మేనేజింగ్ డైరక్టర్‌గా చెప్పుకున్నారు. దీనిలో ఖాదర్ భాషాకు 75 శాతం, విజయకుమార్‌కు 25 శాతం వాటాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఈ బోగస్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కోసం ఒక కాల్ సెంటర్‌ను కూడా స్ధాపించారు. తద్వారా ఫోన్లు చేసి ప్రచారం చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో ప్లాట్లు ఇస్తామంటూ సొమ్ములు వసూలు చేశారు. ఈ క్రమంలో బోరబండకు చెందిన జి.కోటేశ్వర్ రావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు చేసిన ప్రలోభాలకు లొంగి రూ.1,20,000 చెల్లించుకుని మోసపోయాడు. నిందితులపై ఆరు కేసులు విడివిడిగా నమోదై ఉన్నాయి. నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు,వస్తువులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసును తదుపరి విచారణ చేపట్టారు. నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది.