తెలంగాణ

బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన మహారాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డేతో ముంబైలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో బాలికా విద్యకు మహిళా సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అమలు చేస్తున్న పథకాలను తావ్డేకు వివరించారు. తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో తెలంగాణలో గురుకులాల సంఖ్య 813కు పెరిగిందని చెప్పారు. గురుకులాల్లో ప్రతి విద్యార్ధికీ 1.25 లక్షలు వెచ్చిస్తున్నామని తెలిపారు. క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ చైర్మన్‌గా తాను కేంద్రానికి ఇచ్చిన నివేదికలో బాల్య వివాహాలను అరికట్టి , బాలికా విద్యను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను 8వ తరగతి నుండి 12వ తరగతి వరకూ పొడిగించాలని ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించడంతో కేజీబీవీలు ఇక దేశవ్యాప్తంగా 12వ తరగతి వరకూ విద్యను అందిస్తాయని అన్నారు. తెలంగాణలో ఈ ఏడాది నుండి కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభిస్తున్నామని కడియం ఆయనకు వివరించారు. కేజీబీవీల్లో 8వ తరగతి వరకూ వ్యయాన్ని కేంద్రం భరిస్తుండగా, తాము 10వ తరగతి వరకూ వ్యయాన్ని భరిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అత్యంత పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు వివరించారు. నెలకు ఆరు మార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ప్రతి రోజు భోజనంలో 50 గ్రాముల నెయ్యి , ఉదయం రాగిమాల్ట్, రాత్రి గ్లాసు పాలు ఇస్తున్నామని చెప్పారు.
గురుకుల విధానంలో పనిచేస్తున్న 1505 విద్యాసంస్థల్లో ఒకే రకమైన భోజనాన్ని, ఏకరూప దుస్తులను, వసతులను, విద్యను, అకడమిక్ క్యాలండర్‌ను అమలుచేస్తున్నామని అన్నారు. గురుకుల విద్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని, సీసీ కెమరాలను పెట్టామని, కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది నుండి నీట్, జెఈఈకి కోచింగ్ ఏర్పాటు చేస్తున్నామని, గురుకులాల్లో డే స్కూళ్లలో కూడా మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో 28,674 స్కూళ్లలో 25,48,232 మందికి 677 కోట్లు పెట్టి మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. విద్యారంగంలోనే గాక, తెలంగాణలో పేదింటి మహిళల పెళ్లికి షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా 1,00,116 రూపాయిలను అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చుల నిమిత్తం అందిస్తున్నామని అన్నారు. మహారాష్టల్రో విద్యారంగంలో అమలుచేస్తున్న పథకాలను వినోద్ తావ్డే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.