తెలంగాణ

నేరస్థుల నిర్ధారణలో వేలిముద్రలు కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: నేరస్తులను నిర్ధారించడంలో చేతి వేలిముద్రలు చాలా కీలకమని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందని సమయంలో వేలిముద్రలు నిర్ధారించే సరికి కొన్ని నెలల సమయం పట్టేదని, నేరస్తుడు తప్పించుకుపోయేందుకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు క్షణాల్లో వేలిముద్రలతో నేరస్తులను పసిగట్డడం చాలా సులభమైందని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఫింగర్‌ప్రింట్ బ్యూరోని తెలంగాణలో అభివృద్ది చేస్తామని వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజుల పాటు జరిగిన ‘19వ అఖిల భారత ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరక్టర్ల సమావేశం’ ముగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి నాయిని మాట్లాడుతూ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే మంచి పేరుతెచ్చుకుందని అన్నారు. డిజిపి మహేందర్‌రెడ్డి తీసుకున్న అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణల వల్ల పోలీసు సేవలు కింది స్థాయి వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సిసి కెమెరాల ఏర్పాటుతో రికార్డు సృష్టించి నేరాలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమినరేట్ల పరిధిలో గణనీయంగా తగ్గించారని ప్రశంసించారు. త్వరలోనే ఫింగర్ ప్రింట్స్ బ్యూరోను కూడా దేశంలోనే గొప్ప వ్యవస్థగా తెలంగాణలో తీర్చి దిద్దేందుకు డిజిపి కృషి చేస్తున్నారని అన్నారు.
డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వేలిముద్రల నిపుణుడిని నియమించాలనే ఆలోచన ఈ సమావేశం ద్వారా వచ్చిందని అన్నారు. ఇప్పటికే తాము ఫోరెన్సిక్ విభాగాన్ని ఎంతో పటిష్టం చేస్తున్నామని, దానితో పాటు ఫింగర్‌ప్రింట్ బ్యూరోని అభివృద్ధి చేస్తామని వివరించారు. నేరస్తుడిని, నేరాన్ని ఖచ్చితంగా నిర్ధారించడంతలో ఒక శాస్ర్తియ సాక్ష్యాధారంగా ఫింగర్ ప్రింట్ పరిశోధన పని చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఫింగర్ ప్రింట్ బ్యూరో నిపుణులు తాము సైడ్ ట్రాక్‌లో ఉన్నామనే భావనలో ఉన్నారని, కానీ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్ బ్యూరో వ్యవస్థ పని తీరు కీలకమైందని, ప్రతి ఒక్కరూ గుర్తిస్తారని అన్నారు. సమావేశంలో ఎన్‌సిఆర్‌బి డైరక్టర్ డాక్టర్ ఇష్ కుమార్, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, సిఐడి అదనపు డిజి గోవింద్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరో పని చేస్తూ కొన్ని కేసుల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారిని ఉద్దేశించి ప్రచురించిన పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు.