తెలంగాణ

బీసీల స్థితిగతులపై పరిశోధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల స్థితిగతులు వారి విద్య, జీవన విధానంపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయించాలని బీసీ కమిషన్ సూచించింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో విశ్వవిద్యాలయాలు కూడా పాలుపంచుకోవాలని కమిషన్ కోరింది. కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య సాయన్న శుక్రవారం సాయంత్రం బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరు గౌరీశంకర్‌లతో భేటీ అయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని మొత్తం విద్యార్థులు చదవులు, అందులో బీసీ విద్యార్థులు, బీసీ ఉద్యోగుల వివరాలను చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో భౌగోళిక , సామాజిక, ఆర్ధిక, విద్యా, వైద్య రంగాల్లో స్థితిగతులు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రత్యేక స్థితిగతులపై విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలని కమిషన్ కోరింది. ఉత్పత్తి శక్తులుగా ఉన్న బీసీ కులాల స్థితిగతులపై , తెలంగాణలో వారి జీవన విధానాలపై దృష్టి పెట్టాల్సి ఉందని కమిషన్ పేర్కొంది. అందుకు వీసీ సాయన్న స్పందించారు. ఇంత వరకూ వర్శిటీలో జరిగిన ఆర్థిక, సామాజిక రంగాలపై పరిశోధనలను పరిశీలిస్తామని అన్నారు. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పరిశోధనలపై దృష్టి పెడతామని కమిషన్‌కు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ పురుషోత్తం, బీసీ కమిషన్ ప్రత్యేక అధికారి వనమాల చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.