తెలంగాణ

మేథావుల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: మేథావుల భాగస్వామ్యంతో ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక తయారీలో భాగంగా ‘సస్టెయనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ అనే అంశంపై వివిధ రంగాలకు చెందిన మేధావులతో శనివారం రెడ్ హిల్స్‌లోని ప్యాప్సీ భవన్‌లో ఆ పార్టీ సదస్సు నిర్వహించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా సదరన్ రీజియన్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ సమన్వయకర్త డాక్టర్ జె. గీతారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గీతారెడ్డి ప్రసంగిస్తూ ప్రొఫెషనల్స్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా పరోక్షంగా వారి ఆలోచనలు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహకారంతో పార్టీ నేత డాక్టర్ శశిధరూర్ నేతృత్వంలో ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా మేధావుల నుంచి మంచి స్పందన ఉన్నదని, మంచి సలహాలు, సూచనలు వస్తున్నాయని ఆమె తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి ప్రసంగిస్తూ పర్యావరణం, సమతుల్యత కాపాడడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడకపోతే, దేశ వనరులను కాపాడలేమని అన్నారు.
రసాయానాలను ఇష్టానుసారంగా వాడడం వల్ల పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతుల కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అడ్డదిడ్డంగా చేశారని, ప్రజలకు భాగస్వామ్యం లేదని, చివరకు గ్రామ సర్పంచ్‌ను కూడా అరెస్టు చేశారని శశిధర్‌రెడ్డి తెలిపారు.
సదస్సు ముగింపు సందర్భంగా డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కోసం ఎన్నికల ప్రణాలికల్లో అనేక వాగ్దానాలు చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు.
కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా మేధావుల సలహాలు, సూచనలు తీసుకుని ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.