తెలంగాణ

రాష్ట్ర సంస్కృతి, చరిత్రకు ప్రాభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ సంస్కృతి, చరిత్రతో పాటు సామాజిక , ఆర్ధిక, రాజకీయ , కళా రంగాల విశేషాలను నిక్షిప్తం చేసేందుకు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ పూనుకుంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందే ఆంధ్రా హిస్టరీ కాంగ్రెస్ నుండి విడిపోయి ప్రత్యేకంగా తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఏర్పాటైంది. ఆనాటి నుండి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిచెప్పే సంఘటనలు, ఆధారాలు రికార్డు చేస్తున్నారు. 2008, 2009లోనూ జాతీయ సదస్సులను నిర్వహించిన తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ తాజాగా ఈ నెల 25, 26 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించబోతోంది. ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రంలో జరిగే ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి మాజీ గవర్నర్ సి రంగరాజన్‌తో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర లూథర్, నాణాల రంగంలో నిష్ణాతుడు డాక్టర్ రాజారెడ్డి, మాజీ పోస్టు మాస్టర్ జనరల్ హెచ్ రాజేంద్ర ప్రసాద్, మాజీ వీసీ ప్రొఫెసర్ వైకుంఠం, , ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం హాజరవుతారని తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి వెంకట రాజం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి డాక్టర్ వి సదానందం, ఉపాధ్యక్షుడు సయ్యద్ యాకుబ్ అలి, సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ భద్రునాయక్, డాక్టర్ బి లావణ్య, ప్రొఫెసర్ కే అర్జున్‌రావు తదితరులు కూడా పాల్గొంటున్నారని అన్నారు. కాగా ముగింపు కార్యక్రమం జూన్ 26న జరుగుతుందని, అందులో మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, మాజీ సీఎస్ నరేంద్రలూథర్ పాల్గొంటారని అన్నారు.
పరిశోధనలతోనే టెక్నాలజీ అభివృద్ధి:
డాక్టర్ సాయిబాబారెడ్డి
పరిశోధనలతోనే టెక్నాలజీ అభివృద్ధి సాధ్యమని జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిబాబారెడ్డి పేర్కొన్నారు. జేఎన్‌టీయూలో శనివారం నాడు రీసెర్చిపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పరిశోధన రంగం అభివృద్ధి పరిశోధనలపై అవగాహనతోనే సాధ్యమని అన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. పరిశోధనకు కావల్సిన విషయ పరిజ్ఞానం నియమనిబంధనలు ఇటువంటి సదస్సుల వల్ల నేర్చుకోవచ్చని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ ఆర్ శ్రీదేవి అన్నారు.