తెలంగాణ

రేపు హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: విభజన అనంతరం తొరిసారిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీల నేతల కనుసన్నుల్లో ప్రచార పర్యవేక్షణ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 11వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ రేణుకా తెలిపారు. అయితే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల కౌంటింగ్ మాత్రం జూలై 23వ తేదీన ఉంటుందని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షకులుగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, తెలంగాణకు రామన్నదొరలను హైకోర్టు నియమించింది. జల్లాల్లో ఎన్నికల ప్రక్రయను ఆయా జిల్లాల జడ్జిలు, న్యాయాధికారులు పర్యవేక్షిస్తారు.
ఓటర్లను ప్రలోభ పెట్టితే అనర్హత వేటు తప్పదని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ సూచించారు. ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని ఇప్పటికే హైకోర్టు హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను రికార్డు చేయాలని ఆయా జిల్లాల పోలింగ్ పర్యవేక్షకులకు హైకోర్టు సూచించింది. ఇలా ఉండగా గత 35 రోజులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు హైకోర్టుతో పాటు ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రచారం విస్తత్రంగా చేపట్టి, హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. పోటీ అభ్యర్థులు తమ అనుచరులతో ఓటర్ల ఇంటింటికీ వెళ్ళి తమకు ఓటు వేయాలని అభ్యర్థించడం పట్ల జనరల్ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోందని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 27 వేలు, తెలంగాణలో 23 వేల మంది న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకుంటున్నారు.