తెలంగాణ

రెవెన్యూలో ఇక పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రెవెన్యూ శాఖలో ప్రమోషన్లకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం రెండు కమిటీలను ఏర్పాటు చేస్తూ వేర్వేరుగా రెండు జీఓలు జారీ అయ్యాయి. డిప్యూటీ తహశీల్దార్లకు ప్రమోషన్ ఇస్తూ తహశీల్దార్లుగా నియమించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్‌ఏ (చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) ఉంటారు. ఆబ్కారీ శాఖ కమిషనర్ మెంబర్‌గా, సీసీఎల్‌ఏ కార్యదర్శి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. మొత్తం 160 మంది డిప్యూటీ తహశీల్దార్లు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ తహశీల్దార్లకు ప్రమోషన్లు ఇచ్చేందుకు వీలుగా కమిటీ వేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు ఎం. శివశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రమోషన్లు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పరిపాలన మరింత మెరుగవుతుందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగించేందుకు వీలవుతుందని శివశంకర్ అభిప్రాయపడ్డారు.
ఇలా ఉండగా, సీసీఎల్‌లో అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ఫీడర్ క్యాటగిరీ అయిన సూపరింటెండెంట్లకు (గ్రేడ్-1) ప్రమోషన్లు ఇచ్చేందుకు మరో కమిటీని నియమించారు. ఈ కమిటీకి కూడా సీసీఎల్‌ఏ చైర్మన్‌గా, ఆబ్కారీశాఖ కమిషనర్ మెంబర్‌గా, సీసీఎల్ కార్యదర్శి మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. రెండు జీఓలు కూడా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ పేరుతో బుధవారం జారీ అయ్యాయి.