తెలంగాణ

పెట్టుబడులకు అనుకూలం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్తృత అవకాశాలు, కల్పిస్తోన్న ప్రోత్సహకాలపై విదేశాలలో బాగా ప్రచారం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కేంద్ర బృందానికి సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులపై విదేశాలలో ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత రాయబారుల బృందం బుధవారం సచివాలయంలో సిఎస్ జోషితో సమావేశమైంది. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టిఎస్-ఐపాస్‌లోని ముఖ్యాంశాలను సిఎస్ వారికి వివరించారు. టిఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమంగా ఉందని పలువురు పారిశ్రామికవేత్తలు అభినందించారని సిఎస్ గుర్తు చేసారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇండతస్ట్రీయల్ పార్క్‌లను ఏర్పాటు చేసి రాష్ట్ర పారిశ్రామిక వౌలిక వసతుల కల్పన సంస్థ ద్వారా వౌలిక వసతులు కల్పించినట్టు వివరించారు. తెలంగాణలో ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మా, టెక్స్‌టైల్ తదితర రంగాల పరిశ్రమల స్థాపనకు విసృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే 165 పార్క్‌లను సిద్ధం చేసామని, ఇందులో ఫార్మాసిటీ, నిమ్జ్, టెక్స్‌టైల్, సీడ్, ఫుడ్ పార్క్‌లు ఉన్నాయన్నారు. తమ పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించడంతో 7337 యూనిట్ల స్థాపనకు అనుమతించగా రూ.1,30,216 కోట్ల విలువగల పెట్టుబడుల వల్ల ఆరు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. అనుమతించిన వాటిలో ఇప్పటికే 4884 యూనిట్లు ప్రారంభం అయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచిందని సిఎస్ గుర్తు చేసారు. పర్యాటక రంగానికి తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, మెడికల్ హెరిటెజ్, ఎకో, కల్చరల్, బుద్దిజమ్ టూరిజమ్ బాగా అభివృద్ధి చెందిందని, ప్రతీ ఏటా 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారని సిఎస్ వివరించారు. ఫిన్‌లాండ్ దేశ భారత రాయబారి వాణిరావు మాట్లాడుతూ, సైబర్ సెక్యూరిటీ, ఈ-గవర్నెస్, ఎకోసిస్టమ్, ఒకేషనల్ ఎడ్యుకేషన్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వీటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. పెరూ రాయబారి ఎం సుబ్బారాయుడు మాట్లాడుతూ, మైనింగ్, ఇంధనం, గ్రైన్స్‌లో లాటిన్ అమెరికాలో వ్యాపారానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. సిషెల్స్ రాయబారి సయిద్ మాట్లాడుతూ, తెలంగాణ టూరిజమ్ కోసం ప్రమోషనల్ ఈవెంట్‌ను తమ వద్ద నిర్వహిస్తామని, వీటికి సాంస్కృతిక బృందాలను పంపించాలని కోరారు. రాయబారుల బృందానికి మిషన్ కాకతీయ, మిషభ్ భగీరథ, పర్యాటక రంగాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన నిర్వహించారు.