తెలంగాణ

అఖిలపక్ష సమావేశం నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనలో ప్రతిష్టంబన నెలకొన్నందున తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిసి గణాంకాల వివరాలు వెల్లడించడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కేసేఆర్ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు బిసి గణాంకాలు తేల్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని దీంతో ఎన్నికలు ప్రక్రియ ఆలస్యం కాకుండా చూడాలన్నారు. ఇన్నాళ్ళు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రజలు ఊహించారని, కోర్టు సూచనలతో ఓటర్లలో నిరుత్సాహం కల్గిందన్నారు. బిసి కోటాను త్వందరగా హైకోర్టుకు నివేదించాలని ఆయన కోరారు. పంచాయతీ ఎన్నికలపై ఫుల్ బెంచికి ప్రభుత్వం అప్పీలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి గత సార్వత్రిక ఎన్నికల్లో బిసి జనాభా ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మేరిఫెస్టోలో చెప్పారని వాటిని అమలు చేయాలన్నారు. బిసి కులాలను ఎ,బి సి,డి,ఇ గ్రూపులుగా చేర్చాలని ఆయన సూచించారు.

పీఆర్‌సీ గడువు పొడిగింపునిర్ణయించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 27: ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) సిఆర్ బిస్వాల్ చైర్మన్‌గా కొనసాగుతున్న మొదటి పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) గడువును ప్రభుత్వం పొడిగించింది. పదవీ విరమణ చేసిన మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు డాక్టర్ సి. ఉమామహేశ్వరరావు, డాక్టర్ మహమ్మద్ అలీ రఫత్‌లు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ గడువు ఈ నెల 30 తో ముగుస్తుంది. పీఆర్‌సీకి అప్పగించిన పని పూర్తి అయ్యేందుకు మరింత గడువు కావాలని బిస్వాల్ కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఈ గడువును 2018 జూలై 5 వరకు పొడిగించారు. ఈ కారణంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు చెందిన సమాచారాన్ని జూలై 5లోగా పంపించాలని ప్రభుత్వం సూచించింది.