తెలంగాణ

మీరు తప్పులు చేసి.. మమ్మల్ని అంటే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకే వెబ్ కౌనె్సలింగ్ తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం అంతకంటే ముందే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తమకు కావాల్సిన వారందరికీ బదిలీలు చేసిందని, ఇది కౌనె్సలింగ్ పారదర్శకతకు భిన్నమైన వ్యవహారమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడి, ఉపాధ్యాయ సంఘాలే అక్రమాలకు పాల్పడేందుకే కౌనె్సలింగ్ వద్దంటున్నాయని ఉప ముఖ్యమంత్రి చెప్పడం దారుణమని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పాదర్ళకత పాటిస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని వారు కోరారు. ఆప్షన్లలో జరిగిన పొరపాట్లు సవరించుకునే అవకాశం కూడా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సూచించింది. సెర్వర్ల మొరాయింపుతో పాటు ఉపాధ్యాయులు తొలిసారి కంప్యూటర్ ఆప్షన్లు ఇచ్చుకోవడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ప్రాధాన్యతలు మారిపోవడం, కొన్ని పాఠశాలలు వెబ్‌లో కనిపించకపోవడం, భార్యాభర్తల బదిలీల్లో కొందరికి జియోట్యాగ్ పెట్టడం, మరికొందరికి లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయని, వారికి పొరపాట్లు సరిదిద్దుకునే వీలుకల్పించాలని యుయస్పీసీ ప్రతినిధులు సిహెచ్ రాములు, చావ రవి, బీ కొండల్‌రెడ్డి, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు కోరారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో జరిగిన ఇబ్బందులు ఎస్జీటీల ఆప్షన్లలో జరిగిన పొరపాట్లే పునరావృత్తం కాకుండా చూడాలని అన్నారు. ఎస్‌జీటీ బదిలీలకు ఖాళీలన్నింటినీ ప్రకటించాలని టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ డిమాండ్ చేశారు.

పోలీసు ఉద్యోగాలకు 4,87,747 దరఖాస్తులు
ఇంకా మూడు రోజులే గడువు
హైదరాబాద్, జూన్ 27: పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు గాను బుధవారం సాయంత్రానికి 4,87,747 దరఖాస్తులు రాష్ట్ర స్ధాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు అందాయి. ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలకు 1,29,811 దరఖాస్తులు రాగా, ఎస్‌ఐ ఐటిసికి 8,719, ఎఎస్‌ఐ ఎఫ్‌పిబికి 4,842 దరఖాస్తులు రిక్రూట్‌మెంట్ బోర్డుకు అందినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా పోలీసు కానిస్టేబుల్ సివిల్ ఉద్యోగాలకు 3,25,678 దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఇంకా కానిస్టేబుల్ ఐటిసి ఉద్యోగాలకు 9,033, కానిస్టేబుల్ డ్రైవర్ కు 8,479, కానిస్టేబుల్ మెకానిక్‌కు 1,185 దరఖాస్తులు అందినట్లు బోర్డు చైర్మన్ కార్యాలయం తెలిపింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఈ మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రోజుకు కనీసం 30 నుంచి 40 వేల దరఖాస్తులు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తే గడువు తేదీని పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రం భారీ స్పందన వస్తోంది. గ్రాడ్యుయేట్లు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను రిక్రూట్‌మెంట్ బోర్డు మరికొన్ని రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.