తెలంగాణ

వివక్ష చూపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: అఖిల భారత సర్వీసుకు చెందిన అధికారుల పట్ల రాష్ట్రంలో వివక్ష కొనసాగుతోందని ఎస్‌సి, ఎస్‌టి ఐఏఎస్ అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి ఫిర్యాదు చేసింది. తమలో కనీసం సీనియర్లకైనా ప్రాధాన్యతగల పోస్టులు ఇవ్వకుండా లూప్ లైన్ పోస్టులు ఇస్తున్నారని వారు తీవ్ర అవేదన వ్యక్తం చేసారు. ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాలకు చెందిన ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందం బుధవారం సచివాలయానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యారు. వీరిలో శ్యామ్ నాయక్, చంపాలాల్, భారతి హోలికేరి, భారతి లక్‌పతి నాయక్ ప్రీతి మీనా, మురళి ఉన్నారు. ప్రభుత్వంలో ఇతర సామాజిక వర్గాలలోని జూనియర్లకు ప్రాధాన్యతగల పోస్తులు ఇస్తూ, తమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ అధికారులను కూడా విస్మరిస్తున్నారని వారు వాపోయారు. తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులలో ఎస్‌సి, ఎస్‌టిల పట్ల మొదటి నుంచి వివక్ష కనబరుస్తున్నారని వారు వాపోయారు. ‘మీ మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, అయితే లిఖితపూర్వకంగా ఇస్తే ప్రభుత్వం పరిశీలిస్తుంది’ అని సిఎస్ సూచించినట్టు తెలిసింది. లిఖితపూర్వకంగా ఇవ్వాలా? లేదా అనే అంశంపై చర్చించాక తిరిగి కలుస్తామని అధికారుల బృందం సిఎస్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రాకు పదవీ కాలం పొడిగించక పోవడం, ఆయన కంటే ముందటి అధికారికి మాత్రం రెండు పర్యాయాలు పదవీకాలం పొడిగించిన విషయాన్ని సిఎస్‌కు వారు గుర్తు చేసినట్టు తెలిసింది. తమ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన అధికారికి ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్ట్‌లో నియమించిన ఉదంతాన్నీ వివరించినట్టు తెలిసింది.

పూర్తి ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
హైదరాబాద్, జూన్ 27: ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ, ఇంటర్ చదివే బీసీ, ఈబీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు పునరుద్దరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గత డిసెంబర్‌లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ వ్యాప్తంగా 119 బిసి రెసిడెన్సియల్ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలని కూడా డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిసి విద్యార్థులతో కలిసి తెలుగు సంక్షేమ భవన్‌ను బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసిలకు పూర్తి ఫీజులు చెల్లించడం వల్ల ప్రభుత్వంపై కేవలం రూ.120 కోట్ల భారం మాత్రమే పడుతుందని, కానీ దీని వల్ల 9 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. బర్రెలు, గొర్రెలు, చేపల పెంపకం పథకాలంటూ వేల కోట్లు ఖర్చు చేసే కన్నా విద్యావంతులను తయారు చేస్తేబీసీలు ఉన్నత స్ధానానికి వెళతారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్లు అమలు చేయకపోతే ఉద్యం చేపడతామని హెచ్చరించారు.