తెలంగాణ

మహిళలకు ఇందిరమ్మ బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని పునరుద్ధరించి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకూ బీమా కల్పిస్తామని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభయ హస్తం అందజేశారు. బుధవారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభయ హస్తం మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభయహస్తం పేరిట ఒక అద్భుతమైన పథకాన్ని ఏర్పాటు మహిళలకు ఆర్థికంగా భరోసా ఇవ్వడమే కాకుండా వారికీ బీమా కూడా అందజేయడం జరిగిందన్నారు. దీంతో మహిళలకు ఆర్థిక స్వావలంభనకు మంచి మార్గంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమకు మరింత మేలు జరుగుతుందని అనుకున్నారని, అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరింత అన్యాయానికి గురవుతున్నామని మహిళలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు. మహిళలకు ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు 316 రూపాయల చొప్పున 50 లక్షల మంది జమ చేసిన డబ్బులను కేసీఆర్ మింగేశారని ఆయన విమర్శించారు. మహిళల సొమ్ము తిన్న కేసీఆర్‌కు మహిళల ఉసురు తగులుతుందని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను సంఘటితం చేసి, వారికి ఆర్థికంగా ప్రోత్సహించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. మహిళా గ్రూపులకు 10 లక్షల రూపాయల చొప్పున రుణాలు అందిస్తామని, గతంలో ఇచ్చినట్లే సకాలంలో రుణాలు చెల్లిస్తే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని, ఇందిరమ్మ బీమా పథకాన్ని పునరుద్ధరించి మహిళలకు 5 లక్షల రూపాయల వరకు బీమా కల్పిస్తామని ఆయన చెప్పారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, మహిళా మంత్రి లేని ఏకైక మంత్రివర్గం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.