తెలంగాణ

పీఈసెట్ తుది షెడ్యూలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: వ్యాయామ విద్యా కోర్సుల్లో చేరేందుకు పీఈసెట్ తుది దశ కౌనె్సలింగ్ షెడ్యూలు సోమవారం నాడు విడుదల చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సర్ట్ఫికెట్ల పరిశీలన జూలై 21న ప్రారంభం అవుతుందని, దీనికి బీపీఈడీ, డీపీఈడీ అభ్యర్ధులు హాజరుకావాలని అన్నారు. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, 25న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 30వ తేదీన సీట్లు పొందిన అభ్యర్ధులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అన్నారు.
గురుకులాల్లో ఐఐటి, క్లాట్ కోచింగ్
సాంఘిక గురుకులాల్లో ఐఐటి, క్లాట్ లాంగ్‌టెర్మ్ కోచింగ్ కోర్సులను ప్రారంభించినట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. కుటుంబ ఆదాయం ఏటా 2 లక్షల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులని ఆయన చెప్పారు.
ఎమ్సెట్ బైపీసీ కౌనె్సలింగ్
ఈ నెల 17వ తేదీన ఎమ్సెట్ బైపీసీ స్ట్రీం కౌనె్సలింగ్ మొదలవుతుందని అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 17న 1 నుండి 17వేల ర్యాంకు వరకూ అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన ఉంటుందని, పిహెచ్, సీఏపీ అభ్యర్ధులు మాత్రం అన్ని ర్యాంకుల వారూ హాజరుకావాలని సూచించారు.