తెలంగాణ

మైనారిటీ గురుకులాలకు మరో 772 మంది టీచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాలకు మరో 772 మంది టీచర్లను త్వరలో నియమిస్తామని, మరో 1863 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మైనారిటీ సంక్షేమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ కార్యదర్శి దాన కిశోర్, డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసిం, షుకూర్, విక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానకార్యదర్శి మాట్లాడుతూ మైనారిటీ గురుకులాల్లో పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా 1,321 మందిని నియమించామని, మరో 772 మందిని త్వరలో నియమిస్తామని అన్నారు. ఇవిగాక, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా మరో 1,863 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. అలాగే జిల్లాల్లో ఉన్న వక్ఫ్ ఆస్తుల వివరాల లిస్టులను రూపొందించాలని తెలిపారు.
ఈ భూముల్లో విద్యాసంస్థలు నిర్మించే విషయమై ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. మైనారిటీ యువతకు వివిధ రంగాల్లో మెరుగైన శిక్షణను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని అన్నారు. తదుపరి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2వేల కోట్ల రూపాయిల బడ్జెట్ కేటాయించామని, షాదీ ముబారక్ పథకం ద్వారా 24,662 మంది దరఖాస్తు చేసుకోగా, 11,746 మందికి మంజూరు చేశామని, మిగతావి పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి ఇంత వరకూ 968 మందిని ఎంపిక చేసి 109 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామని అన్నారు.
మల్టీ సెక్టోరియల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 2016-17లో ఏడు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 126 కోట్ల రూపాయిలు మంజూరు చేసిందని, మొదటి దశగా కేంద్రం 37.80 కోట్లు, రాష్ట్రం 25.20 కోట్లు చెల్లించాయన్నారు. మరో ఆరు రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసిందని అన్నారు. కేంద్రం వాటా 10.08 కోట్లు, రాష్ట్ర వాటా 21.60 కోట్లు విడదల చేయడం జరిగిందని చెప్పారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఐఎఎస్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మైనారిటీ విద్యార్థులకు శిక్షణ సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.