తెలంగాణ

వికారి నామ సంవత్సర పండుగల తేదీలు ఇవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: శ్రీవికారి నామ సంవత్సరంలో పండగల తేదీలను తెలంగాణ విద్వత్సభ నేతృత్వంలో జరిగిన జ్యోతిష మహాసభ మంగళవారం ప్రకటించింది. తెలంగాణ విద్వత్సభ నేతృత్వంలో ‘జ్యోతిష మహాసభలు-2018’ రవీంద్రభారతిలో సోమ, మంగళవారాల్లో జరిగాయి. ఈ సభల్లో దాదాపు వంద మంది పండితులు చర్చించి పండగల తేదీలను నిర్ణయించారు. సభ నిర్ణయించిన పండగ తేదీలు ఇలా ఉన్నాయి. ఉగాది 2019 ఏప్రిల్ 6. స్మార్త శ్రీరామనవమి ఏప్రిల్ 13, శ్రీవైష్టవ శ్రీరామనవమి ఏప్రిల్ 14. శ్రీహనుమద్విజయోత్సవం ఏప్రిల్ 19. బుద్దపూర్ణిమ 2019 మే 18. శ్రీహనుమజ్జయంతి మే 29. ఏరువాక పూర్ణిమ జూన్ 17. జగన్నాథ రథయాత్ర జూలై 4. వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ జూలై 16. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం జూలై 17. నాగుల చవితి ఆగస్టు 4. గరుడపంచమి ఆగస్టు 5. వరలక్ష్మీవ్రతం ఆగస్టు 9. స్మార్థ శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 23. శ్రీవైష్ణవ శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 24. పొలాల అమావాస్య ఆగస్టు 30. మహాలయ పక్షారంభం సెప్టెంబర్ 14. మహాలయ అమావాస్య సెప్టెంబర్ 28. దేవీ శరన్నవరాత్రారంభం సెప్టెంబర్ 29. సరస్వతీ పూజ, గరుడ జయంతి అక్టోబర్ 5. దుర్గాష్టమి, బతుకమ్మ పండగ అక్టోబర్ 6. మహార్నవమి అక్టోబర్ 7. విజయదశమి అక్టోబర్ 8. నరక చతుర్ధశి, దీపావళి అక్టోబర్ 27. కేదారవ్రతం అక్టోబర్ 28. కార్తీక పూర్ణిమ నవంబర్ 12. దత్తజయంతి డిసెంబర్ 11. భోగి 2020 జనవరి 14. సంక్రాంతి జనవరి 15. కనుము 16. శ్రీపంచమి జనవరి 30. రథసప్తమి ఫిబ్రవరి 1. వ్యాసపూర్ణిమ 9. కామదహనం మార్చి 8. ఉగాది 2020 మార్చి 25.
పండగల జాబితాను ప్రభుత్వ పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ కే.వీ. రమణాచారికి విద్వత్ సభ అందించింది.