తెలంగాణ

జూరాలకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 16: గత నాలుగు రోజులగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతాలు వర్షపు నీటితో ప్రాజెక్టులను వరద ముంచెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.360 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుండి జూరాలకు 1,22,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా..ప్రాజెక్టు 13 గేట్లను తెరిచి 1,29,097 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 48 వేల క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-1, 2కు 2,050, కుడి, ఎడమ కాలువలకు 1,837, సమాంతర కాలువలకు 900 క్యూసెక్కుల చొప్పున మొత్తం 1,29,097 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి నుండి జూరాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు గేట్ల ద్వారా లక్షకు పైగా క్యూసెక్కుల నీరు కృష్ణానది ద్వారా దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు పరుగులు పెడుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. జూరాలకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని లోయర్, అప్పర్ జలవిద్యుత్కేంద్రాల వద్ద 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో మరో వారం రోజుల పాటు వరద ఉద్ధృతి కొనసాగే అవకాశాలు ఉన్నాయని జెన్‌కో అధికారులు తెలిపారు.