తెలంగాణ

సోషల్ మీడియాలో ముందస్తు సర్వే హల్-చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ముందస్తు ఎన్నికల ప్రకటనకు ముందే సోషల్ మీడియాలో ముందస్తు సర్వేలూ హల్-్ఛల్ చేస్తున్నాయి. తాజాగా ఎన్డీటీవీ, ఇండియా టు-డే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ 62 స్థానాల్లో, టీఆర్‌ఎస్ 42 స్థానాల్లో, బీజేపీ మూడు, మజ్లీస్ పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించనున్నట్లు సోషల్ మీడియా (వాట్సాప్)లో జోరుగా తిరిగింది. కాగా మంగళవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’ ఈ విషయమై ఎన్డీటీవీని సంప్రదించగా, తాము ఎటువంటి సర్వే నిర్వహించలేదని, అదంతా బూటకమని తేల్చింది. ఇండియా టు-డే కూడా ఎటువంటి సర్వే నిర్వహించలేదు. అయితే వాట్సాప్‌లో నియోజకవర్గాల వారీగా కూడా ఏ పార్టీ విజయం సాధించనున్నదో పేర్కొనడం గమనార్హం.
ఆ మీడియా సంస్థలు సర్వే నిర్వహించనప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఎవరో కావాలనే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసేందుకు సృష్టించి ఉంటారని వివిధ పార్టీల నాయకులు అంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా సమాచారాలు వస్తున్నప్పటికీ, ఇటువంటివి తప్పుడు సర్వేలు, వార్తలు పెట్టడం దురదృష్టకరమని వారన్నారు.