తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 4: బోధనలోనూ, ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలోనూ, పరిశోధనలోనూ ప్రత్యేక కృషి చేసిన టీచర్లను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ బుధవారం పురస్కారాలను అందజేయనున్నారు. రాష్టస్థ్రాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నాడు రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరవుతారు. సభకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షత వహిస్తాదరు. ప్రత్యేక అతిథిగా మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి హాజరవుతారు. గౌరవ అతిథులుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ హాజరవుతారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, కాలేజీయేట్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ విద్య కమిషనర్ ఎ అశోక్, పాఠశాల విద్య కమిషనర్ టీ విజయ్‌కుమార్ హాజరవుతారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించి ముఖ్య అతిథుల సందేశాల అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందజేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి 10 వేల రూపాయిల నగదు, బంగారు పూతపూసిన వెండి పతకం, ఒక ప్రశంసాపత్రం, షాల్ ఇస్తారు.
ఉత్తమ టీచర్లు: కే పార్ధసారధి (ఆదిలాబాద్) గుంటి అనురాధ (కొత్తగూడెం), ఎక్యూ నాజర్ (హైదరాబాద్), ఎస్ ఫ్లోరెన్స్‌రోజ్ మేరీ( హైదరాబాద్) , జీ గోవర్థన్ (జగిత్యాల), వి దయాకర్‌రెడ్డి (జనగామ), బి సోమనాథరాజు(జనగామ), పన్నాటి సత్యనారాయణ (్భపాలపల్లి), బి సాయిలు (కామారెడ్డి), ఎన్ విద్యాసాగర్ (కరీంనగర్), రామమోహన రావు(ఖమ్మం), పి ప్రభాకర్‌రెడ్డి(ఖమ్మం), ఎం శ్రీనివాసులు (మహబూబాబాద్), కే నర్సింహారెడ్డి (మహబూబాబాద్), పి కల్పన (మహబూబాబాద్), బి నరేందర్ (మహబూబ్‌నగర్), బాలు యాదవ్ బైకాని (మహబూబ్‌నగర్), వి రాధాకృష్ణ (మంచిర్యాల), బీ గౌరీశంకర్ (మేడ్చెల్), పీవీ రమణ (మేడ్చెల్), ఎం మంగళ(నల్గోండ), వి వెంకటరాం (నల్గొండ), ఎ రాజేంద్రప్రసాద్ రావు(నిజామాబాద్), కోట రామచంద్రారెడ్డి (పెద్దపల్లి), ఎవి దినేష్(రంగారెడ్డి), గానె రాజిరెడ్డి (సిద్దిపేట), టి రవీందర్‌రెడ్డి (సిద్దిపేట), కే కృష్ణారెడ్డి (వికారాబాద్), కే రామాచారి(వికారాబాద్), ఎన్ నివేదిత (వరంగల్), ఇ సుమాదేవి( వరంగల్ అర్బన్), ఎం సోమయ్య (వరంగల్ అర్బన్), పి మాధవరెడ్డి (్భవనగిరి) ఉన్నారు.
యూనివర్శిటీ టీచర్లు: ఉస్మానియా యూనివర్శిటీ నుండి ప్రొఫెసర్ శివరాజ్, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎం కుమార్, ప్రొఫెసర్ వై పార్థసారథి, ప్రొఫెసర్ కే స్టీవెన్‌సన్ ఉన్నారు. అగ్రికల్చర్ వర్శిటీ నుండి ప్రొఫెసర్ టి హైమావతి, ప్రొఫెసర్ వి అనిత, ప్రొఫెసర్ వీరమల్ల రాములు, డాక్టర్ ఐ వి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వీ గౌరీశంకర్ ఉన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ నుండి ప్రొఫెసర్ సి వెంకటయ్య, ప్రొఫెసర్ జీ పుష్పా చక్రపాణి, డాక్టర్ బనోత్ లాల్ , వెటర్నరీ వర్శిటీ నుండి డాక్టర్ డి నాగలక్ష్మి, జెఎన్‌టియు కూకట్‌పల్లి నుండి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రొఫెసర్ బి బాలునాయక్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ నుండి ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల , మహాత్మాగాంధీ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఆకుల రవి, నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా నుండి ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ, నిమ్స్ యూనివర్శిటీ నుండి డాక్టర్ సి సదాశివుడు, డాక్టర్ లక్కిరెడ్డి మహేశ్వర్, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ నుండి డాక్టర్ పి ప్రశాంత్, ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల నుండి డాక్టర్ అనుపమ, డాక్టర్ మీనా కుమారి, పి వెంకటరమణ, డాక్టర్ డి విద్యాధర్, జి సుకన్య, డాక్టర్ బి సుధ, డాక్టర్ జి అంగేల, డాక్టర్ కే హుస్సేన్, బి శ్రీనివాసరెడ్డి, కాకతీయ వర్శిటీ నుండి డాక్టర్ రమావత్ రవి, ఎ లక్ష్మీనారాయణ, ఎ శ్రీనివాస్, పాలమూరు వర్శిటీ నుండి డాక్టర్ ఎం విజయకుమార్, శాతవాహన వర్శిటీ నుండి డాక్టర్ వి భిక్షపతి, ఎం చంద్రకుమార్, ఎ మీనాక్షి, తెలంగాణ యూనివర్శిటీ నుండి డాక్టర్ ఎస్ రంగరత్నం, పి రామమోహనరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్స్ కోటా నుండి డాక్టర్ మగపు శ్రీదేవి, లైబ్రరియన్ల కోటా నుండి ఎన్‌కే అరుణజ్యోతి, కాళోజీ నారాయణరావు వైద్య యూనివర్శిటీ నుండి డాక్టర్ రాకేష్ సహాయ్, డాక్టర్ ఎన్ వి ఎన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసకళ్యాణి, ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ నుండి ప్రొఫెసర్ వి ఫణి శ్రీ, తెలంగాణ యూనివర్శిటీ నుండి డాక్టర్ వి త్రివేణి ఈ జాబితాలో ఉన్నారు.
జూనియర్ కాలేజీల లెక్చరర్లు: జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఒడ్డెన్న, వి భాను నాయక్, శంకర్ నారాయణ్ గౌడ్, అర్రా అంజయ్య, డాక్టర్ సిహెచ్ ప్రభాకర్‌రెడ్డి, సిహెచ్ జ్యోతిర్మయి, సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, సుంకర రమేష్, టి సుధారాణి, మహ్మద్ ఫహీముద్దీన్ ఉత్తమ లెక్చరర్లుగా ఎంపికయ్యారు.