తెలంగాణ

నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థకు (నుడా) పాలకవర్గాన్ని నియమిస్తూ మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. నుడా చైర్మన్‌గా సి ప్రభాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సభ్యులుగా నిజామాబాద్ ఎమ్మెల్యే బింగాల గణేశ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, పట్టణ ప్రణాళిక నుంచి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఆర్థికశాఖ నుంచి నిజామాబాద్ ట్రైజరీ డిప్యూటీ డైరెక్టర్‌ను నియమించినట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు ముంచొస్తుంటే ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభపై నియాజక వర్గానికి చెందిన నేతలు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్థానిక సమస్యలు పరిష్కరించాలని సూచిస్తే తమపై ఎస్టీఎస్సీ కేసులు బనాయిస్తోందని వారు వాపోయారు. వచ్చే ఎన్నికల్లో శోభకు టికెట్ ఇవ్వకూడదనివారు కోరారు. వ్యక్తిగత స్వార్థంతో తెరాసకు నష్టం చేకూర్చుతోందని వారు ధ్వజమెత్తారు. స్థానిక అభివృద్ధి పనుల్లో తమను భాగస్వామ్యం చేయడంలేదని చెప్పారు.ఎస్‌జిఎస్ పేరుతో సొంత సైన్యం ఏర్పాటు చేసుకుందన్నారు. ఎస్‌జిస్‌తో బెరింపులకు పాల్పడుతోందన్నారు. చొప్పదండి నియోజక వర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెపై నిరసన వ్యక్తం చేశారు.
దొంగల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 5: నిజాం మ్యూజియంలోని విలువైన వస్తువులను అపహరించిన దొంగలు ఆచూకి కోసం పోలీసులు అన్ని రాష్ట్రాల పోలీసుతో సంప్రదిస్తున్నారు. గత ఆదివారం రాత్రి నిజాం మ్యూజియంలోని బంగారు, డైమండ్, వెండి, వజ్రాలతో కూడిన వస్తువులను ఇద్దరు దొంగలు అపహరించారు. ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పోలీస్ కమిషనర్లకు సంఘటనకు చెందిన ప్యూటెజ్‌లను పంపించారు. దొంగలను మరో రెండు రోజుల్లో పట్టుకుంటాలని హైదరాబాద్ నేరవిభాగం అదనపు ఎస్పీ శిఖాగోయాల్ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణ కామరెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని, వాటికి సంబంధించిన వివరాలను పోలీసులు రాబట్టారు. దొంగల కోసం ఏర్పాటు చేసిన 15 పోలీసు బృందాలు సమష్టిగా పని చేస్తున్నారని టాస్క్ఫుర్స్ డిసిపి రాధాకృష్ణ తెలిపారు.